News July 14, 2024

బోనం ఎత్తుకున్న ఝాన్సీరెడ్డి

image

మహాత్మా జ్యోతిబా ఫూలే భవన్‌లో పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ ఝాన్సీరెడ్డి బోనం ఎత్తుకొని సందడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు పాడిపంటలతో సంతోషంగా ఉండాలని ఝాన్సీరెడ్డి ఆకాంక్షించారు. పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Similar News

News July 5, 2025

నర్సంపేట: ఇళ్లలో చోరీ.. ఏడుగురు అరెస్ట్

image

నర్సంపేటలో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ అంకిత్ వివరాలు.. ఖానాపురం మండలానికి చెందిన రాజేశ్, నర్సంపేటకు అక్షయ్ కుమార్, అక్షయ్, సాయిరాం, ఉదయ్, విపిన్, సుబానిలు గ్రూప్‌గా ఏర్పడి డబ్బుల కోసం ఇళ్లల్లో దొంగతనం చేస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో బంగారాన్ని కుదువ పెట్టి వచ్చిన డబ్బులతో జల్సాలు చేశారు. దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశామన్నారు.

News July 5, 2025

వరంగల్: ముమ్మరంగా సాగుతున్న రేషన్ కార్డుల సర్వే

image

కొత్త రేషన్ కార్డుల కొరకు వచ్చిన దరఖాస్తులపై అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తున్నారు. వరంగల్ జిల్లాలో 14,087 దరఖాస్తులు రాగా, 5,667 దరఖాస్తులను ఇప్పటికే పరిశీలించారు. ఆయా గ్రామాల్లోని పంచాయతీ కార్యాలయాల్లో సర్వే నిర్వహిస్తున్నారు. సర్వే పూర్తయిన అనంతరం నూతన రేషన్ కార్డులు మంజూరు కానున్నాయి. సుమారు 12 ఏళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు కానుండటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News July 4, 2025

యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు: కలెక్టర్

image

ఎరువుల షాపుల డీలర్లు, యజమానులు యూరియాను కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్య శారద దేవి హెచ్చరించారు. శుక్రవారం సంగెం మండలం గవిచర్ల, కాపుల కనపర్తి గ్రామాల్లో ఉన్న ఎరువుల షాపులు, కో-ఆపరేటివ్ సొసైటీలను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. రైతులను ఇబ్బంది పెడితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు.