News February 4, 2025
బోనకల్లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
Similar News
News December 24, 2025
కోదాడ శివారులో రోడ్డుప్రమాదం

కోదాడ మండలం ద్వారకుంట సమీపంలో తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో శివ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివ మరణంతో ఆసుపత్రి వద్ద కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదం ఎలా జరిగింది? మృతికి గల కారణాలేమిటి? అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News December 24, 2025
GNT: జమాబందీ లేక భూ రికార్డుల్లో గందరగోళం

గుంటూరు జిల్లా రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను కొన్నేళ్లుగా నిర్వహించకపోవడంతో భూమి రికార్డులు గందరగోళంగా మారాయి. తహశీల్దార్ కార్యాలయాల్లో ఆర్వోఆర్ నిర్వహణ సరిగా లేకపోవడం, కంప్యూటర్ ఆపరేటర్లపై పూర్తిగా ఆధారపడటం వల్ల అవినీతి ఆరోపణలు పెరుగుతున్నాయి. ఏటా జమాబందీ జరిగితే భూమి హక్కులు స్పష్టమవుతాయి. కానీ అది లేకపోవడంతో జిల్లాలో భూవివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
News December 24, 2025
OTTలోకి ‘బాహుబలి: ది ఎపిక్’

‘బాహుబలి: ది ఎపిక్’ సినిమా ఈరోజు అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ని కలిపి ‘బాహుబలి: ది ఎపిక్’గా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ చేశారు. ఈ మూవీ డ్యూరేషన్ 3:48 గంటలు. కాగా రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి’ మూవీ తెలుగు సినిమా చరిత్రనే మార్చేసింది. తెలుగు సినిమాలకు పాన్ ఇండియా మార్కెట్ను పరిచయం చేసింది.


