News February 4, 2025
బోనకల్‌లో సినీ నిర్మాత కేపీ.చౌదరి అంత్యక్రియలు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలం రాయన్నపేట గ్రామానికి చెందిన సినీ నిర్మాత కేపీ.చౌదరి సోమవారం ఆర్థిక పరిస్థితులు తట్టుకోలేక గోవాలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన మృతదేహాన్ని ఈరోజు సాయంత్రం స్వస్థలమైన రాయన్నపేట గ్రామానికి తీసుకురానున్నారు. స్వగ్రామంలోనే ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.
Similar News
News February 14, 2025
దివాన్ చెరువు: లారీ డ్రైవర్ పై దుండగులు దాడి

ప్రకాశం జిల్లా కొమరోలు గ్రామానికి చెందిన లారీడ్రైవర్ చంద్రుడు దివాన్‌చెరువు పండ్లమార్కెట్ దాటిన తరువాత రోడ్డుపక్కన లారీని ఆపాడు. గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ముసుగులు ధరించి డ్రైవర్‌పై దాడిచేసి రూ.7,800 నగదు, రెండుసెల్ ఫోన్లు లాక్కుని పారిపోయారు. డ్రైవర్‌ను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు బొమ్మూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News February 14, 2025
అనకాపల్లి: పతనమైన టమాటా ధర

నాలుగు రోజుల నుంచి టమాటా ధర దారుణంగా పడిపోయింది. ఈ వారం మొదట్లో 30 కేజీల గల క్రేట్ రూ.150 వరకు పలకగా గురువారం ఉదయం రూ.50కి కూడా కొనే నాథుడే లేడు. దీంతో టమాటా రైతులు దయనీయస్థితి ఎదుర్కొంటున్నారు. గొలుగొండ మండలంలోని రైతులు గురువారం కృష్ణదేవిపేటకు టమాటాలను తరలించినప్పటికీ కొనుగోలుదారులు లేక తీవ్రంగా నష్టపోయారు. దీంతో అమ్మేవాడు తప్పా కొనేవాడు లేని పరిస్థితి నెలకొంది.
News February 14, 2025
రాజమండ్రి: సీఐడీ డీఎస్పీ అనుమానాస్పద మృతి

రాజమండ్రిలో సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీగా విధులు నిర్వర్తించే నాగరాజు గురువారం అనుమానాస్పదంగా మృతి చెందాడు. రాజమండ్రిలోని గాంధీపురం పరిధిలోని ఓ గుడివద్ద మృతదేహం పడి ఉందని పోలీసులకు సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి చూస్తే డీఎస్పీగా తెలింది. 1995 బ్యాచ్‌కి చెందినవారు. సీఐడీ విభాగంలో నాగరాజు రాజమండ్రిలో పని చేసినట్లు అధికారులు తెలిపారు. ఆయన స్వస్థలం కర్నూలు జిల్లా ఆస్పరి.