News November 13, 2024
బోనకల్: కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు

ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, వంట గ్యాస్ రూ.500కి అందించడమే కాక, అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని నందిని విక్రమార్క తెలిపారు.
Similar News
News December 17, 2025
ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో శిక్షణ

ఖమ్మం జిల్లా మహిళా ప్రాంగణంలో కమ్యూనిటీ హెల్త్వర్కర్, కంప్యూటర్, టైలరింగ్, బ్యూటీషియన్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నామని ప్రాంగణ అధికారి వేల్పుల విజేత తెలిపారు. 18 నుంచి 35 ఏళ్లలోపు, అర్హత కలిగిన ఆసక్తిగల మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యార్హతలు కోర్సును బట్టి 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణతగా నిర్ణయించారు. ఈ నెల 20వ తేదీ లోపు ప్రాంగణంలో దరఖాస్తులు సమర్పించాలని ఆమె కోరారు.
News December 17, 2025
ఖమ్మం జిల్లాలో ప్రారంభమైన పోలింగ్

ఖమ్మం జిల్లాలో తుది విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2నుంచి ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. కాగా పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు.
☆ తుది విడత పంచాయతీ ఎన్నికల UPDATE కోసం Way2Newsను చూస్తూ ఉండండి.
News December 17, 2025
బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్ పనులపై మంత్రి సమీక్ష

సత్తుపల్లిలోని బుగ్గపాడు ఇండస్ట్రియల్ పార్క్లో మౌలిక వసతుల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి పనుల పురోగతిని సమీక్షించారు. పెరుగుతున్న పెట్టుబడిదారుల ఆసక్తి నేపథ్యంలో 200 ఎకరాల మెగా ఫుడ్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ జోన్లలో యూనిట్ నిర్మాణాలు త్వరగా ప్రారంభించాలన్నారు.


