News November 15, 2024
బోనకల్: 60 ఏళ్ల వృద్ధుడిపై అత్యాచార కేసు
బోనకల్ మండలంలో ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోటయ్య (60) అనే వృద్ధుడిపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుబాబు గురువారం తెలిపారు. ఈ నెల 11న రాత్రి వివాహితను కోటయ్య మేకల షెడ్డులోకి లాక్కెళ్లి మద్యం తాగించి, అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారని ఎస్సై చెప్పారు. ఆమె భర్త ఒంటిపై గాయం గమనించి అడగగా, బాధితురాలు నిజాన్ని వెల్లడించిందన్నారు.
Similar News
News December 11, 2024
కమనీయం భద్రాద్రి రామయ్య నిత్యకళ్యాణం
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం బేడా మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.
News December 11, 2024
ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా..!
ఖమ్మం జిల్లాలో ఏసీబీ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. ఈ ఎడాదిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. ఇటీవల కలెక్టరేట్‌లో ఓ అధికారి పట్టుబడిన విషయం తెలిసిందే. దీంతో ఏసీబీ అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. అధికారులు ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే ఖమ్మం రేంజ్ కార్యాలయం నెంబర్లు-9154388981, 08742-228663, ఈ-మెయిల్ dsp_acb_kmm@telangana. gov.inను సంప్రదించాలన్నారు.
News December 11, 2024
ప్రజావాణిలో 27వేలకు పైగా సమస్యలకు పరిష్కారం:భట్టి
ప్రజావాణిలో 27వేలకుపైగా సమస్యలకు పరిష్కారించినట్లు డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ఈ నెల 8వ తేదీకి సరిగ్గా ప్రజావాణి కార్యక్రమం మొదలుపెట్టి ఏడాది అయింది. ఈ సందర్భంగా వార్షిక రిపోర్ట్‌ను ప్రభుత్వం రిలీజ్ చేసింది. ప్రజావాణికి ఇప్పటివరకూ మొత్తం 82,955 అప్లికేషన్లు వచ్చాయి. ఇందులో గ్రీవెన్స్‌కు సంబంధించినవి 43, 272 ఉండగా.. 62 శాతం పరిష్కారమయ్యాయన్నారు. మిగతావి ప్రాసెస్‌లో ఉన్నట్టు వెల్లడించారు.