News July 20, 2024
బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్

అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ బలగం అంతా రేపు సికింద్రాబాద్లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు.
Similar News
News November 12, 2025
HYD: DEC 3 నుంచి టీజీసెట్ హాల్ టికెట్లు

రాష్ట్రవ్యాప్తంగా అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్నకు అర్హత సాధించేందుకు నిర్వహించే తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ సెట్)- 2025 పరీక్ష హాల్ టికెట్లను వచ్చే నెల 3వ తేదీ నుంచి తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి.శ్రీనివాస్ తెలిపారు. 29 సబ్జెక్టుల పరీక్షలను వచ్చే నెల 10వ తేదీ నుంచి 3 రోజుల పాటు నిర్వహిస్తామని స్పష్టంచేశారు.
News November 12, 2025
సచివాలయంలో 134 మంది ఆఫీసర్స్ బదిలీ

సచివాలయం సంచలన నిర్ణయం తీసుకుంది. 134 మంది అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్లను బదిలీ చేస్తూ సీఎస్ కె.రామకృష్ణ రావు ఉత్తర్వూలు జారీ చేశారు. పుష్కర కాలంగా ఒకే శాఖలో సేవలందిస్తున్న ASOలకు ఈసారి స్థానచలనం కల్పించారు. ఈ బదిలీలు సచివాలయంలో గమనించదగిన మార్పులుగా చెప్పొచ్చు.
News November 12, 2025
చంచల్గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

HYDలోని చంచల్గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.


