News July 20, 2024
బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్
అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ బలగం అంతా రేపు సికింద్రాబాద్‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు.
Similar News
News October 12, 2024
హైదరాబాదీలకు దసరా స్పెషల్ ఏంటి?
దసరా వేడుకలు తెలంగాణ వారందరికీ స్పెషల్.. ఇక్కడి వారికి అమ్మమ్మ ఇల్లు యాదికొస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో HYDలో ఉద్యోగాలు చేస్తూ తిరిగి సొంతూరుకు వెళ్లడం, బంధువులు, దోస్తులతో ఊరంతా తిరగడం బాగుంటుంది. ‘ఎప్పుడొచ్చినవ్.. అంతా మంచిదేనా’ అంటూ తెలిసినవారి పలకరింపు ఆనందాన్ని కలిగిస్తుంది. ఉరెళ్తామని ఎన్నో రకాల పిండివంటలు సిద్ధం చేస్తారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
HYD: నేడు జన్వాడకు సింగర్ మంగ్లీ, జానులైరి
శంకర్‌పల్లి మండలంలోని జన్వాడలో ఈ ఏడాది కూడా దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. వేడుకలకు సింగర్ మంగ్లి, ఫోక్ డాన్సర్ జానులైరితో పాటు మరికొందరు కళాకారులు సందడి చేయనున్నట్లు బీజేపీ నాయకుడు గౌడిచర్ల వెంకటేశ్ యాదవ్ తెలిపారు. ఏటా బోనాలకు ఆహ్వానించే స్పెషల్ గెస్టులను ఈ సారి దసరాకు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
News October 12, 2024
HYD: దసరా శుభాకాంక్షలు తెలిపిన ఆమ్రపాలి కాట
GHMC కమిషనర్ ఆమ్రపాలి కాట ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు ఐకమత్యంతో శాంతియుతంగా పండుగను జరుపుకోవాలని సూచించారు. నగర అభివృద్ధి, పరిశుభ్రత, సుందరీకరణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. దసరా అందరికీ సుఖసంతోషాలను, శాంతిని, సుభిక్షాన్ని అందించాలని కమిషనర్ కోరారు.