News July 20, 2024
బోనాలు: రేపు దద్దరిల్లనున్న హైదరాబాద్
అమ్మ బైలెల్లినాదో.. అంటూ రేపు లష్కర్ హోరెత్తనుంది. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, డప్పు చప్పుళ్ల నడుమ ఆడపడుచులు ఉజ్జయిని మహంకాళికి బోనాలు సమర్పిస్తారు. హైదరాబాద్ బలగం అంతా రేపు సికింద్రాబాద్‌లో సందడి చేస్తారు. ఇక ఎల్లుండి ఘటాల ఊరేగింపు కోసం యువత ప్రత్యేకంగా సన్నద్ధం అవుతున్నారు. నగర పోలీసులు ఆలయం వద్ద ఇప్పటికే శాంతిభద్రతల పర్యవేక్షణ చేపట్టారు.
Similar News
News December 1, 2024
మిని శిల్పారామంలో అలరించిన సాంస్కృతిక ప్రదర్శన
ఉప్పల్ మిని శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం నిర్వహించిన పలు కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. జీవన శిష్య బృందం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన, సుప్రజ బృందం కథక్ నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. సంగీతానికి అనుగుణంగా సాగిన వారి నృత్యం చూపరులను మంత్రి ముగ్ధులను చేసింది.
News December 1, 2024
HYD: శ్రీనివాస పద్మావతి అమ్మవారికి పద్మశాలిల చీర, సారె
తిరుమల, తిరుపతి దేవస్థానం, తిరుచానూర్‌లోని శ్రీనివాస పద్మావతి అమ్మవారి ఆలయ బ్రహ్మోత్సవాల్లో అఖిల భారత పద్మశాలి సంఘం జాతీయ మహిళా విభాగం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన మహిళా ప్రతినిధులు పాల్గొని అమ్మవారికి చీర,సారెను అందజేశారు. పద్మావతి అమ్మవారిని పద్మశాలి ఆడపడుచుగా భావించి తల్లిగారి తరపున చీర, సారెను అందజేసినట్లు అఖిల భారత పద్మశాలి సంఘం మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు వనం దుష్యంతల తెలిపారు.
News December 1, 2024
HYDలో పుష్ప-2 ప్రీ రిలీజ్ EVENT.. ట్రాఫిక్ ఆంక్షలు
HYDలోని యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో డిసెంబర్ 2న సా.4 నుంచి రా.10 వరకు అల్లు అర్జున్, రష్మిక మందన్న నటించిన పుష్ప-2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో పంజాగుట్ట, యూసఫ్‌గూడ, కృష్ణానగర్, మోతీనగర్, బోరబండ, జూబ్లీహిల్స్, మైత్రివనంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. జానకమ్మ తోటలో జనరల్ పబ్లిక్ వాహనాల పార్కింగ్ కాగా సవేరా, మహమ్మద్ ఫంక్షన్ హాళ్లలో ఓన్లీ 4 వీలర్ పార్కింగ్ ఉంటుందని అధికారు లు తెలిపారు.