News March 13, 2025
బోరగడ్డ అనిల్‌ను మచిలీపట్నం తీసుకురానున్న పోలీసులు

YCP నేత బోరుగడ్డ అనిల్‌పై చిలకలపూడి పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. సోషల్ మీడియాలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లపై దూషణ కేసులో అనిల్ కుమార్ ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నాడు. ఆయనపై గతంలో చిలకలపూడి PSలో 2 కేసులు నమోదై ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయనను అదుపులోకి తీసుకునేందుకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో రాజమండ్రి నుంచి కాసేపటి క్రితం అనిల్‌ను ఇక్కడకు తీసుకొచ్చారు.
Similar News
News April 10, 2026
పెడనలో మట్టి మాఫియా బరితెగింపు!

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.
News April 10, 2026
రక్తదానం ప్రాణదానంతో సమానమనం: కలెక్టర్ బాలాజీ

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.
News April 10, 2026
కృష్ణా: ఆలయ భూముల్లో అక్రమ మైనింగ్..!

కృష్ణాజిల్లాలో మరోసారి దేవాలయ భూములపై వివాదం రేకెత్తింది. మచిలీపట్నం బచ్చుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పెడన(M) కొంకెపూడి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి చెందిన సుమారు 4 ఎకరాల భూమిలో నల్ల మట్టిని భారీగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.900కు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


