News March 11, 2025
బోరుగడ్డకు బెయిల్ ఇవ్వొద్దు: పోలీసులు

సీఎం చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులను దూషించిన కేసులో బోరుగడ్డ అనిల్కు బెయిల్ ఇవ్వొద్దని నాలుగో పట్టణ పోలీసులు అనంతపురం ఎక్సైజ్ కోర్టుకు విన్నవించారు. తల్లికి అనారోగ్యం పేరుతో మధ్యంతర బెయిల్ పొందిన ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారని, తప్పుడు పత్రాలు సమర్పించారని పేర్కొన్నారు. దీంతో ఈ అంశంపై హైకోర్టులో తేలేవరకు విచారణను పెండింగ్లో ఉంచుతున్నట్లు న్యాయాధికారి తెలిపారు.
Similar News
News November 14, 2025
జీవకోన వాసికి 14 రోజుల రిమాండ్

భారీ స్థాయిలో గంజాయి సరఫరా చేస్తున్న స్మగ్లర్ను అలిపిరి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ రామకిశోర్ వివరాల మేరకు.. గురువారం గంజాయి తరలిస్తున్న జీవకోన వాసి జగదీష్ (37)ను ఉదయం 10 గంటలకు గోవింద హోమ్ స్టే సమీపంలో పట్టుకున్నారు. 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు.
News November 14, 2025
కౌంటింగ్లో కుట్రకు ప్లాన్: తేజస్వీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను నెమ్మదింపజేసేందుకు రేపు కుట్ర జరుగుతుందని RJD నేత తేజస్వీ యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. మహాగఠ్బంధన్ అభ్యర్థులు గెలిస్తే ప్రకటించవద్దని, తొలుత ఎన్డీయే అభ్యర్థుల గెలుపునే ప్రకటించాలని అధికారులకు చెప్పారని పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులకు ఫోన్లు చేశారని తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. క్లియర్ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.
News November 14, 2025
మడ్చల్: ఎర్రజెండాతోనే సమస్యల పరిష్కారం: MLA

భారత దేశంలో ప్రత్యామ్నాయం కమ్యూనిజమేనని, ప్రజా సమస్యల పరిష్కారం ఎర్రజెండాలతోనే సాధ్యమని భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి, MLA కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సమావేశం ఈసీఐఎల్లోని నీలం రాజశేఖర్ రెడ్డి భవన్లో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె.శ్రీనివాస్ అధ్యక్షతన జరగగా, కూనంనేని ముఖ్య అతిధిగా హాజరయ్యారు.


