News October 30, 2024

బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగింపు

image

గుంటూరులో ఓ వ్యక్తిని రూ.50లక్షలు ఇవ్వాలని బెదిరించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్‌కు రిమాండ్ పొడగిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. మూడు రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీలో విచారణ అనంతరం పోలీసులు అనిల్‌ను కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ను నవంబర్ 12వ తేదీ వరకు పొడిగించింది. దీంతో పోలీసులు తిరిగి అనిల్‌ను రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు. 

Similar News

News November 10, 2025

గుంటూరు జిల్లా ప్రజలకు కలెక్టర్ సూచన

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం సోమవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల ప్రధాన కార్యాలయాల్లో జరుగుతుందని కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inలో కూడా సమర్పించవచ్చని, అదేవిధంగా 1100 నంబర్‌కి డయల్ చేసి అర్జీ స్థితిని తెలుసుకోవచ్చని చెప్పారు. ప్రజలు పీజీఆర్ఎస్‌ని సద్వినియోగం చేసుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

News November 9, 2025

ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అప్టేట్

image

తాడేపల్లి పరిధి ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం ఉదయం ఇన్‌ఫ్లో 68,623 క్యూసెక్కులు ఉండగా దిగువకు 60,150 క్యూసెక్కులు, కేఈ మెయిన్ ద్వారా 3,238 క్యూసెక్కులు, కేడబ్ల్యు మెయిన్ 5,009 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్ ద్వారా 226 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటిమట్టం 12 అడుగులకు చేరినట్లు అధికారులు తెలిపారు.