News January 3, 2025

బోరుగడ్డ అనిల్ బెయిల్ ఫిటిషన్ కొట్టివేత

image

బోరుగడ్డ అనిల్‌ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టడమే బోరుగడ్డ పనిగా పెట్టుకున్నట్లు ఉందని వ్యాఖ్యానించింది. అతణ్ని మరికొంతకాలం జైల్లోనే ఉండనీయండని ఆదేశించింది. అలాంటి వారిపై కనికరం చూపించడానికి వీల్లేదంటూ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. కాగా సోషల్ మీడియాలో అసభ్య పోస్టుల కేసులో బోరుగడ్డ అరెస్టైన సంగతి తెలిసిందే.

Similar News

News November 4, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.

News November 4, 2025

తెనాలి: ప్రభుత్వ పథకాల పేరుతో వృద్ధురాళ్లకు టోకరా

image

ప్రభుత్వ పథకం కింద తక్కువ ధరకు టీవీ, ఫ్రిడ్జ్‌ వంటి వస్తువులు ఇస్తామని, తీసుకోకుంటే పథకాలు ఆగిపోయాయని తెనాలి వీఎస్సార్‌ కళాశాల రోడ్డులో నివసించే 60 ఏళ్ల బొద్దులూరి సీతామహాలక్ష్మికి, గంగానమ్మపేటకు చెందిన లింగమల్లు ఆమనికి గుర్తు తెలియని వ్యక్తులు టోకరా వేశారు. ఒకరి వద్ద రూ.40 వేలు, మరొకరి వద్ద రూ. 30 వేలు తీసుకుని పత్తాలేకుండా పోయారు. మోసపోయామని గ్రహించిన ఇద్దరూ తెనాలి టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు.

News November 3, 2025

GNT: పత్తి రైతులకు కలెక్టర్ సూచన

image

రైతులు CM యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా సూచించారు. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను సోమవారం కలెక్టర్ ఆవిష్కరించారు. సీసీఐ ద్వారా క్వింటాలుకు రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. ప్రత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్లులలో రైతులు విక్రయించవచ్చన్నారు. CM యాప్‌లో (CM APP) నమోదు చేసుకుని, జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు.