News June 29, 2024
బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలోని వివిధ బ్యాంకర్లు నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. కలెక్టర్ చాంబర్లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. 2023- 24 ఆర్థిక సంవత్సరంలో జరిగిన ప్రగతిపై బ్యాంకు అధికారులతో చర్చించారు. ఈ ఏడాది పీఎంఈజీపీ కింద యూనిట్లు ఇవ్వడానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు.
Similar News
News November 18, 2025
బాలానగర్: ఫోన్‌పే చేస్తే.. ఖాతాలో రూ.28 వేలు మాయం

బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కిరాణా షాపులో ఫోన్‌పే ద్వారా రూ.1,260 పంపగా.. కొద్దిసేపటికి అతని ఖాతాలో ఉన్న రూ.28 వేలు మాయమయ్యాయి. దీంతో అవాక్కైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కేసు నమోదు చేశారు. సైబర్ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఎస్సై సూచించారు.

News November 17, 2025
బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.