News February 21, 2025
బ్యాంకర్లు వార్షిక రుణ లక్ష్యాలు సాధించాలి: ASF కలెక్టర్

బ్యాంకర్లు ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్లో నాబార్డ్ మేనేజర్లతో కలిసి జిల్లా బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి నిర్దేశించిన లక్ష్యం రూ.2,289 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.1, 268 కోట్లు అందించినట్లు తెలిపారు. అర్హులకు రుణలు అందజేస్తామన్నారు.
Similar News
News December 6, 2025
మెదక్: నేడు రెండో విడత అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు

మెదక్ జిల్లాలో రెండో విడత ఎన్నికలు జరగనున్న గ్రామ పంచాయతీలలో పోటీ చేసే అభ్యర్థులకు నేడు గుర్తులు కేటాయించనున్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉండగా, అనంతరం తెలుగు అక్షరమాల పద్ధతిలో అభ్యర్థులకు గుర్తులను కేటాయించనున్నారు. మెదక్, చిన్న శంకరంపేట, రామాయంపేట, నిజాంపేట తూప్రాన్, మనోహరాబాద్, చేగుంట, నార్సింగి మండలాలలో రెండో విడత ఎన్నికలు జరగనున్నాయి.
News December 6, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.540 తగ్గి రూ.1,30,150కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.500 పతనమై రూ.1,19,300పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.100 తగ్గి రూ.1,95,900గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 6, 2025
వెస్టిండీస్ వీరోచిత పోరాటం..

న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ అసాధారణ రీతిలో ఆడుతోంది. రికార్డు స్థాయిలో 531 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు వీరోచిత పోరాటం చేస్తోంది. జస్టిన్ గ్రీవ్స్(181*), కీమర్ రోచ్ (53*) కలిసి 7వ వికెట్కు ఏకంగా 154 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. షాయ్ హోప్ 140 పరుగులు చేసి ఔట్ అయ్యారు. చేతిలో మరో 4 వికెట్లు ఉన్నాయి. 17 ఓవర్లలో 98 పరుగులు చేయాల్సి ఉంది. మరి లక్ష్యాన్ని WI అందుకుంటుందా?


