News February 21, 2025

బ్యాంకర్లు వార్షిక రుణ లక్ష్యాలు  సాధించాలి: ASF కలెక్టర్

image

బ్యాంకర్లు ఆర్థిక సంవత్సరం నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో నాబార్డ్ మేనేజర్లతో కలిసి జిల్లా బ్యాంకర్లతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ రంగానికి నిర్దేశించిన లక్ష్యం రూ.2,289 కోట్లు కాగా ఇప్పటివరకు రూ.1, 268 కోట్లు అందించినట్లు తెలిపారు. అర్హులకు రుణలు అందజేస్తామన్నారు.

Similar News

News March 24, 2025

సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే 8 మంది మృతి?

image

TG: ఫిబ్రవరి 22న SLBC సొరంగం కూలి 8 మంది చిక్కుకుపోయిన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సొరంగం కూలిన 7 నిమిషాల్లోనే అందరూ మృతి చెందినట్లు అధికారులు అంచనాకు వచ్చారని, ఈ మేరకు నేడు CMతో జరిగే సమీక్షలో వెల్లడించనున్నట్లు సమాచారం. బురద వల్ల మృతదేహాలు కుళ్లిపోయి ఉంటాయని భావిస్తున్నారు. కాగా, 8మందిలో ఒకరి మృతదేహాన్ని వెలికితీసిన విషయం తెలిసిందే. మరోవైపు సొరంగంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

News March 24, 2025

కెరమెరి: కుక్కకాటు.. బాలుడి మృతి

image

కుక్కకాటుతో 4ఏళ్ల బాలుడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. కెరమెరికి చెందిన చౌహాన్ రుద్ర దాస్,సరోజ దంపతుల కుమారుడు రిషిని కొద్ది రోజుల కిందట కుక్క కరిచింది. అప్పుడు తల్లిదండ్రులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఇంటికొచ్చిన కొద్దిరోజులకు బాలుడిలో మళ్లీ రేబిస్ లక్షణాలు కనిపించాయి. దీంతో కాగజ్‌నగర్ ఆసుపత్రికి, అక్కడి నుంచి మంచిర్యాలకు తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు.

News March 24, 2025

పోలీస్ కుటుంబాలు నన్ను తిట్టుకుంటున్నాయి: MLA

image

చిత్తూరు జిల్లాలో పోలీసు కుటుంబాలు తనను తిట్టుకుంటున్నాయని పలమనేరు MLA అమర్‌నాథ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరులో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య అనంతరం వైసీపీకి అనుకూలంగా పని చేసిన వారిని మార్చమని అడిగితే.. SP ఇష్టానికి బదిలీలు చేశారని ఆరోపించారు. దీంతో వారి భార్యా పిల్లలు తనను ద్వేషిస్తున్నారన్నారు. ప్రజా ప్రతినిధులు శాశ్వతం కాదని, అధికారులే శాశ్వతం అని ఆయన పేర్కొన్నారు.

error: Content is protected !!