News July 23, 2024
బ్యాంకర్లు విరివిగా రుణాలు ఇవ్వాలి: గుంటూరు కలెక్టర్

జిల్లాలో వ్యవసాయరంగం అభివృద్ధికి బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ నాగలక్ష్మీ తెలిపారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్ల జిల్లా కన్సల్టేటివ్ కమిటీ సమావేశం జరిగింది. యువతను, మహిళలను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించేందుకు కృషి చేయాలని కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు బ్యాంకర్లు విరివిగా రుణాలు మంజూరు చేయాలని కలెక్టర్ చెప్పారు.
Similar News
News February 23, 2026
గుంటూరు జిల్లాలో ఇంటర్ పరీక్షల సందడి

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మరికాసేపట్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తం 68,898 మంది విద్యార్థులు హాజరవుతుండగా, వారి కోసం అధికారులు 87 పరీక్షా కేంద్రాలను సర్వం సిద్ధం చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అధికారులు అన్ని కేంద్రాల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేశారు.
News February 23, 2026
నేడు గుంటూరు కలెక్టరేట్‌లో PGRS: కలెక్టర్

గుంటూరు కలెక్టరేట్‌లో సోమవారం PGRS, రెవెన్యూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాట్లు కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా తెలిపారు. https://Meekosam.ap.gov.inసైట్‌లో అర్జీలు సమర్పించవచ్చన్నారు. 1100 టోల్ ఫ్రీ ద్వారా అర్జీల స్థితిని తెలుసుకొవచ్చని సూచించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం 4 రెవెన్యూక్లీనిక్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.