News March 29, 2025
బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

ఓ ఫంక్షన్లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.
Similar News
News December 27, 2025
MNCL: పోలీస్ కమిషనరేట్ పరిధిలో తగ్గిన నేరాలు: సీపీ

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోలిస్తే 2025లో ప్రధాన నేరాలు తగ్గాయని సీపీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడారు. హత్యలు, దోపిడీలు, గృహాల్లో చోరీలు, అల్లర్లు, అత్యాచారం, మోసం, హత్యాయత్నం, తదితర నేరాలు తగ్గినట్లు పేర్కొన్నారు. నివారణాత్మక పోలీసింగ్, అధిక నిఘా చర్యలు, వివిధ శాఖల మధ్య సమన్వయంతో ఇది సాధ్యమైందన్నారు.
News December 27, 2025
జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.
News December 27, 2025
పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్ ఇంజెక్షన్ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.


