News March 29, 2025

బ్యాంకాక్‌లో భూకంపం.. రామగుండం ఎమ్మెల్యే సతీమణి స్పందన

image

ఓ ఫంక్షన్‌లో పాల్గొనేందుకు పిల్లలతో సహా రామగుండం ఎమ్మెల్యే భార్య మనాలీఠాకూర్ బ్యాంకాక్ వెళ్లారు. వేడుక పూర్తికాగానే ఇండియా వచ్చేందుకు సిద్ధమవుతుండగా భవనం కంపించడం మొదలై, ప్రకంపనలు భారీగా రావడంతో పిల్లలతో కలిసి ప్రాణాలు దక్కించుకునేందుకు భవనం నుంచి బయటికి వచ్చామని మనాలీఠాకూర్ తెలిపారు. బయటకు వచ్చిన తర్వాత క్షణాల్లో భవనం కూలిపోయిందని చెప్పారు. ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాలేదని అన్నారు.

Similar News

News April 21, 2025

భూ భారతి చట్టం రైతులకు భద్రత: కలెక్టర్

image

భూభారతి చట్టంతో రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయని రైతులకు ఈ చట్టం భద్రతగా ఉంటుందని కలెక్టర్ సంతోష్ అన్నారు. సోమవారం అలంపూర్ పట్టణంలో ఓ ఫంక్షన్ హల్ లో ఏర్పాటు చేసిన భూ భారతి చట్టంపై అవగాహన సదస్సు కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. భూ భారతి చట్టం వల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయని అన్నారు.

News April 21, 2025

కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 1/2

image

పోప్ ఫ్రాన్సిస్ <<16168572>>కన్నుమూయడంతో<<>> 20 రోజుల తర్వాత నూతన క్రైస్తవ మతగురువును ఎన్నుకోనున్నారు. అందుకోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్ చర్చిల సీనియర్లు(వారిని కార్డినల్స్ అని పిలుస్తారు) వాటికన్ సిటీలోని సిస్టిన్ చాపెల్ భవనానికి వెళ్తారు. ఎన్నిక సమయంలో వారికి బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. ఫోన్, రేడియో, న్యూస్‌పేపర్ల వంటివేవీ అందుబాటులో ఉంచరు.

News April 21, 2025

కొత్త పోప్‌ను ఎలా ఎన్నుకుంటారంటే? 2/2

image

ఎవరు పోప్ కావాలనుకుంటున్నారో కార్డినల్స్ పేపర్లో రాసి బ్యాలెట్‌లో వేస్తారు. స్పష్టమైన మెజార్టీ రాకపోతే వాటిని కాల్చడం ద్వారా వచ్చే నల్లటి పొగ చిమ్నీ ద్వారా బయటికి వెలువడుతుంది. ఇది ఎంపిక ప్రక్రియ పూర్తికాలేదనేందుకు సంకేతం. మళ్లీ ఓటింగ్ జరుగుతుంది. 2/3 మెజార్టీ వచ్చినవారు పోప్‌గా ఎన్నికవుతారు. ఓ కెమికల్‌ కలిపి, ఆ బ్యాలెట్ పత్రాలను కాల్చేస్తారు. అలా వెలువడే తెల్లటి పొగ కొత్త పోప్ ఎన్నికకు చిహ్నం.

error: Content is protected !!