News January 29, 2025

బ్యాంకులో పకడ్బందీ భద్రత ఏర్పాట్లు చేయాలి:ఎస్పీ 

image

భద్రాద్రి జిల్లా ఎస్పీ కార్యాలయంలో జిల్లాలోని అన్ని బ్యాంకుల అధికారులతో ఎస్పీ రోహిత్ రాజు మంగళవారం సమావేశం అయ్యారు. ఇటీవల వరంగల్, బీదర్ ప్రాంతాల్లోని బ్యాంకుల్లో జరిగిన దొంగతనాలను ఉద్దేశించి జిల్లాలో జరగకుండా బ్యాంక్ అధికారులు పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని తెలిపారు. బ్యాంక్ లోపల, వెలుపల అన్ని ప్రదేశాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సెక్యూరిటీ అలారం ఉండాలన్నారు.

Similar News

News December 6, 2025

ఇండిగో.. రిఫండ్ చేస్తే సరిపోతుందా?

image

ఇండిగో ఫ్లైట్స్ రద్దవడంతో వేలమంది ఇబ్బంది పడ్డారు. CEO సారీ కూడా చెప్పారు. టికెట్ డబ్బు రిఫండ్ చేస్తామన్నారు. చాలామంది జర్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. దాంతో వాళ్లు ముందుగానే బుక్ చేసుకున్న హోటల్స్ రిఫండ్ చేస్తాయో లేదో తెలీదు. వేరే ఫ్లైట్స్‌కి వెళ్లిన వాళ్లు రూ.7 వేల టికెట్‌ని రూ.50 వేలకు కొన్నారు. ఇలా ఏదోలా ప్రయాణికులు నష్టపోయారు. మరి ఇండిగో కేవలం టికెట్ డబ్బు రిఫండ్ చేస్తే సరిపోతుందా? COMMENT.

News December 6, 2025

బాలిక విన్నపంపై స్పందించిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే

image

మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో నాల్గో తరగతి బాలిక ఐశ్వర్య తమ ఇంటి పట్టా సమస్యను ఎమ్మెల్యే సురేంద్ర బాబు దృష్టికి తీసుకెళ్లింది. ఎమ్మెల్యే వెంటనే స్పందించి, తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది, టీడీపీ నాయకులు స్థలాన్ని పరిశీలించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణమే ఇంటి పట్టా మంజూరు చేశారు. విద్యార్థి కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

News December 6, 2025

కర్నూలు జిల్లా రైతులకు శుభవార్త

image

కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వడ్ల కొనుగోలు ఈనెల 8న ప్రారంభం కానుందని మార్కెట్ యార్డ్ కార్యదర్శి జయలక్ష్మి వెల్లడించారు. మార్కెట్ యార్డు కార్యాలయంలో అధికారులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. రైతులు పండించిన వడ్ల పంటను మార్కెట్ యార్డుకు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన కనీస మద్దతు ధర(MSP)కు అనుగుణంగా పారదర్శకంగా కొనుగోళ్లు జరుగుతాయని అన్నారు.