News August 31, 2024

బ్యాంకు అకౌంట్ తప్పిదాలను సరి చేసుకోవాలి: AO

image

ఆధార్ కార్డు, బ్యాంక్ రుణం అకౌంట్‌లో తప్పిదాలతో రుణమాఫీ కాలేదో అలాంటి రైతులు బ్యాంకుకు వెళ్లి సరి చేసుకోవాలని సిర్గాపూర్ AO శశాంక్ తెలిపారు. ప్రతి బ్యాంక్‌లో ఒక నోడల్ అధికారికి కరెక్షన్, ఎడిట్ ఆప్షన్ ఇచ్చామన్నారు. రైతులు సెప్టెంబర్ 7 వరకు బ్యాంక్‌కు వెళ్లి తమ ఆధార్ కార్డుపై ఉన్న బ్యాంక్ అకౌంట్ పేరు ఉండేలా కరెక్షన్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News December 4, 2025

MDK: స్థానిక ఎన్నికలపై దృష్టి సారించిన మాజీ ఎమ్మెల్యే

image

రామాయంపేట మండల వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలను పూర్తిగా కైవసం చేస్తున్నందుకు కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతుంది. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మండలంపై ప్రత్యేక దృష్టి సారించారు. అన్ని గ్రామాలలో సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునే విధంగా పార్టీ నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీ చేస్తే గెలుపొందే అభ్యర్థులను మద్దతు తెలుపుతూ ఇతరులు వైదొలగే విధంగా బుజ్జగిస్తున్నారు.

News December 4, 2025

వెల్దుర్తి: ఎండ్రకాయల వేటకు వెళ్లి వ్యక్తి గల్లంతు

image

వెల్దుర్తి హల్దీవాగులో ఎండ్రకాయ వేటకు వెళ్లి వ్యక్తి అదృశ్యమైన ఘటన హస్తాల్ పూర్ శివారులో చోటు చేసుకుంది. గ్రామంలోని గంగిరెద్దులాగా చెందిన జానపాటి సాయిలు, ఆవుల దుర్గయ్య అలియాస్ శంకర్ (42) గ్రామ శివారులోని హల్దీవాగుకి ఎండ్రకాయల వేటకు వెళ్లారు. ఇరువురు ఎండ్రకాయలు పట్టుకొని బయటకు వస్తుండగా, దుర్గయ్య నీటిలో ఒక్కసారిగా మునిగి పోయాడు. దీంతో ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు.

News December 4, 2025

మెదక్ జిల్లాలో 15 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

మెదక్ జిల్లాలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 15 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో పాపన్నపేట మండలంలో 6, పెద్దశంకరంపేట మండలంలో 5, టెక్మాల్ మండలంలో 3 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. హవేలీ ఘనపూర్ మండలం గాజిరెడ్డిపల్లి సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవమైంది.