News May 3, 2024
బ్యాంకు లావాదేవీలపై నివేదికలు ఇవ్వండి: కలెక్టర్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంక్ లావాదేవీలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రతిరోజు నివేదికలు అందజేయాలని నంద్యాల జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా. కె.శ్రీనివాసులు అన్ని బ్యాంకుల రీజినల్ మేనేజర్లను సూచించారు గురువారం ఆయన చాంబర్లో ఛాంబర్లో బ్యాంక్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఒకరి కన్నా ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరిపినట్లయితే సంబంధిత వివరాల డేటాను ఇవ్వాలన్నారు.
Similar News
News November 5, 2025
ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలు త్వరగా పరిష్కరిస్తాం: కలెక్టర్

కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీ సమస్యలను త్వరగా పరిష్కరిస్తామని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి తెలిపారు. బుధవారం సాయంత్రం మెడికల్ కాలేజీ సమావేశ మందిరంలో అన్ని వైద్య విభాగాల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతుల మెరుగుదల కోసం చర్యలు తీసుకుంటామన్నారు. మంత్రి టీజీ భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని కలెక్టర్ తెలిపారు.
News November 5, 2025
కర్నూలు జిల్లాలో SIల బదిలీలు: SP

కర్నూలు జిల్లాలో SIల బదిలీలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మంగళవారం బదిలీల ఉత్తర్వులు జారీ చేశారు. గూడూరు SI అశోక్‌ను కర్నూలు తాలూకా PSకు, SI ఎం.తిమ్మయ్యను కర్నూలు 3 టౌన్ నుంచి కర్నూలు 2 టౌన్‌కు, SI జి.హనుమంత రెడ్డిని 2 టౌన్ నుంచి గూడూరుకు, SI ఏసీ పీరయ్యను కర్నూలు తాలూకా PS నుంచి కర్నూలు 3 టౌన్‌కు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 5, 2025
కర్నూలు కలెక్టరే టీచర్

కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థినుల మధ్య ఉపాధ్యాయురాలిగా కూర్చుని, వారికి విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యత గురించి వివరించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.


