News January 24, 2025

బ్యాంకు లింకేజీ లక్ష్యాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

image

జిల్లాలో నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో DRDO దత్తారాం, ప్రాజెక్టు మేనేజర్ వెంకట్‌లతో బ్యాంకు లింకేజీ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన బ్యాంకులు ఈ నెల 29 వరకు 100 శాతం లింకేజీ సాధించాలన్నారు.

Similar News

News February 24, 2026

రేపటి నుంచే ఇంటర్ పరీక్షలు.. హాల్‌టికెట్ తీసుకున్నారా?

image

తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు మొదలుకానున్నాయి. ఫస్ట్, సెకండియర్ కలిపి 9,97,075 మంది ఎగ్జామ్స్ రాయనున్నారు. ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలు కానుండగా విద్యార్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్‌కు చేరుకోవాలి. ఇప్పటికే హాల్ టికెట్లు విడుదలవగా.. ఇంకా తీసుకోనివారు <>tgbieht.cgg.gov.in<<>> సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం లేకపోయినా అనుమతిస్తారు. ALL THE BEST

News February 24, 2026

ములుగు: డీజీపీ ఎదుట లొంగిపోయిన దామోదర్

image

ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన రాష్ట్ర కార్యదర్శి బడే దామోదర్ అలియాస్ చొక్కారావు 30 ఏళ్ల అజ్ఞాత జీవితం అనంతరం లొంగిపోయాడు. అతనితో పాటు మావోయిస్ట్ కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్ జీ అలియాస్ తిప్పిరి తిరుపతి, ఇతర నేతలు మల్లా రాజిరెడ్డి, నూనె నరసింహారెడ్డి తదితరులు తెలంగాణా డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో లొంగిపోయారు. ‘పోరుకన్నా.. ఊరు మిన్న’ పిలుపు ఫలితమిచ్చింది.

News February 24, 2026

పార్వతీపురం: ‘మార్ట్ ప్రాజెక్టుతో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలి’

image

మన్యం అగ్రి రూరల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రాజెక్టు అమలుతో జిల్లాలో గ్రామీణ ఆర్థిక ముఖచిత్రం మారాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి ఆకాంక్షించారు. మంగళవారం పార్వతీపుం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాలతో గ్రామీణ, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో మార్ట్ ప్రాజెక్టును ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఇందుకు అవసరమైన ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు.