News January 24, 2025
బ్యాంకు లింకేజీ లక్ష్యాలు సాధించాలి: ASF అదనపు కలెక్టర్

జిల్లాలో నిర్దేశించిన బ్యాంకు లింకేజీ లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేలా అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. గురువారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో DRDO దత్తారాం, ప్రాజెక్టు మేనేజర్ వెంకట్‌లతో బ్యాంకు లింకేజీ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో నిర్దేశించిన బ్యాంకులు ఈ నెల 29 వరకు 100 శాతం లింకేజీ సాధించాలన్నారు.
Similar News
News February 10, 2025
గుంటూరు: ఎమ్మెల్సీ ఎన్నికల అబ్జర్వర్‌గా కరుణ

ఉమ్మడి కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల పరిశీలకురాలిగా వి.కరుణ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం గుంటూరు కలెక్టరేట్‌ను ఆమె సందర్శించారు. కలెక్టర్ నాగలక్ష్మీ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లు, నామినేషన్లతో పాటూ ఇతర వివరాలను ఎన్నికల పరిశీలకురాలికి కలెక్టర్ వివరించారు.
News February 10, 2025
టీచర్ ఉద్యోగ నియామకాల ఆలస్యం.. హైకోర్టు ఆగ్రహం

TG: DSC-2008 నియామకాల ఆలస్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 1,382 మందిని ఇవాళ్టిలోగా కాంట్రాక్టు టీచర్లుగా నియమించాలని <<15354548>>ఆదేశించినా<<>> అమలు చేయకపోవడంతో విద్యాశాఖపై మండిపడింది. కోర్టు ధిక్కరణగా భావించాల్సి ఉంటుందని ప్రభుత్వ న్యాయవాదిని హెచ్చరించింది. మూడు రోజుల్లోగా ప్రక్రియ పూర్తిచేస్తామని విద్యాశాఖ కమిషనర్ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.
News February 10, 2025
ప్రజలకు అవగాహన కల్పించాలి: నెల్లూరు కలెక్టర్

నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని సమావేశ ప్రాంగణంలో మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతినెలా మూడవ శనివారం అన్నిశాఖల అధికారులు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై ప్రత్యేక శ్రద్ధపెట్టాలన్నారు. పీఎం సూర్యఘర్ యోజన పథకంపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు.