News July 22, 2024

బ్యాంకు లీకేజీ టార్గెట్‌ను త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్

image

కామారెడ్డి జిల్లాలో ఉన్న బ్యాంకు లీకేజీ టార్గెట్‌ను త్వరితగతిన నెలల వారీగా అన్ని మండలాల్లో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వన్ ఆదేశించారు. సోమవారం ఆయన DRDA సిబ్బందితో సమావేశమై మాట్లాడుతూ.. మహిళా శక్తిలో భాగంగా గుర్తించిన అన్ని రకాల యాక్టివిటీలు, గ్రౌండింగ్ కూడా పూర్తి చేయాలన్నారు. ఈ సమావేశంలో డిఆర్డిఏ పిడి చందర్, డిపిఎం రమేష్ , రవీందర్, సుధాకర్, వకుళ తదితరులు పాల్గొన్నారు.

Similar News

News October 7, 2024

KMR: ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు పరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలు సమర్ధవంతంగా నిర్వహించాలని CMO సీనియర్ అధికారి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. KMR కలెక్టరేట్‌లో కలెక్టర్, సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు క్రింద ఫ్యామిలీ డిజిటల్ కార్డు నిర్వహిస్తున్నామని, ప్రతీ కుటుంబం సమాచారాన్ని సేకరించాలన్నారు. ధాన్యం సేకరణపై ఆయన సమీక్షించారు.

News October 7, 2024

నసురుల్లాబాద్: గుండెపోటుతో యువతి మృతి

image

కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలం సంగెం గ్రామానికి చెందిన డేగావత్ బీనా (19) గుండెపోటుతో మృతి చెందింది. ఉన్నట్టుండి డెగావత్ బీనాకు ఛాతిలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. యువతి మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది. గతంలో మృతురాలు బీనా తాత కూడా గుండెపోటుతో మరణించాడు.

News October 7, 2024

కామారెడ్డి: మూడు ఉద్యోగాలు వద్దని లేఖ

image

కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన అరుణ మూడు ఉద్యోగాలను వదులుకున్నారు. 2018లో TGT, PGT ఉద్యోగాలు రాగా, 2019లో JLగా ఎంపికై విధుల్లో చేరారు. అనంతరం DL ఉద్యోగం రావడంతో JL ఉద్యోగం వదులుకున్నారు. తాజాగా DSCలో ర్యాంకు సాధించారు. అరుణ తాను సాధించిన 5 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలకు నాట్ విల్లింగ్ లేఖను డీఈఓకు అందజేసింది. లెటర్ ఇవ్వడం వల్ల ఉద్యోగాలు ఇతరులకు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు.