News January 13, 2025
బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI
ఆదిలాబాద్ కలెక్టరేట్లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 5, 2025
గుడిహత్నూర్లో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి
గుడిహత్నూర్ మండలంలోని సీతాగొంది వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. కమలాపూర్ గ్రామానికి చెందిన భౌరే చిన్న గంగాధర్ (60) బైక్ పై ఆదిలాబాద్ వెళ్తున్నాడు. ఈ క్రమంలో సీతాగొంది సమీపంలో ఉన్న హైమద్ ధాబా నుంచి యు టర్న్ తీసుకుంటుండగా ఓ కారు వచ్చి ఢీకొంది. దీంతో అతడు అక్కడికక్కడే మృతిచెందినట్లు వెల్లడించారు.
News February 5, 2025
ADB: రైలు పట్టాలపై పడి మృతి
తిరుపతి దైవ దర్శనానికి వెళ్లిన వ్యక్తి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరడిగొండ మండలం రెంగన్వాడి గ్రామానికి చెందిన సిడం చిత్రు (57), విఠల్తో కలిసి రైలులో ఇటీవల దైవదర్శనానికి తిరుపతికి వెళ్లారు. తిరుగుప్రయాణంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు రైలు పట్టాలపై పడి చిత్రు మృతిచెందారు.
News February 5, 2025
నిర్మల్: ఇద్దరు ఉపాధ్యాయులపై పోక్సో కేసు: SI
నర్సాపూర్(జి) మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పని చేస్తున్న <<15345603>>ఉపాధ్యాయులపై<<>> పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయికిరణ్ బుధవారం తెలిపారు. జిల్లా చైల్డ్ వెల్ఫేర్ శాఖ సూపర్వైజర్ ఫిర్యాదు చేయడంతో మోహన్ రావ్, మనోహర్ రెడ్డిలపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని ఎస్సై పేర్కొన్నారు.