News January 13, 2025
బ్యాంకు సామగ్రి చోరీకి యత్నం.. ఒకరికి రిమాండ్: CI

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోని SBI బ్యాంకు సామగ్రిని చోరీ చేయటానికి ఆదివారం దుండగులు యత్నించినట్లు టూటౌన్ సీఐ కరుణాకర్ తెలిపారు. ఇద్దరు దుండగులు బ్యాంకు పాత ఫర్నీచర్, నగదు లెక్కించే చెడిపోయిన యంత్రం చోరీకి ప్రయత్నిస్తుండగా.. వాచ్మెన్ నర్సింలు గమనించారు. ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో వారు పరారయ్యారు. వీరిలో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.
Similar News
News February 19, 2025
బజార్హత్నూర్‌లో మృతదేహం లభ్యం

బజార్హత్నూర్ మండలంలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. మండలంలోని కడెం వాగులో బుధవారం ఓ శవం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతుడి హత్యా? లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
News February 19, 2025
ADB: అప్పుల బాధతో రైతు సూసైడ్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పార్టీ(కే) గ్రామానికి చెందిన బోడగిరి రాజు(40) తన 3 ఎకరాల భూమితో పాటు మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకొని పంట సాగు చేశాడు. అనుకున్న మేర పంట దిగుబడి రాలేదు. రుణమాఫీ కూడా కాకపోవడంతో అప్పు ఎట్లా తీర్చాలో అని మనస్తాపం చెంది పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
News February 19, 2025
ADB: కాంగ్రెస్ ఆ స్థానాన్ని నిలబెట్టుకుంటుందా..?

ఉమ్మడి ADB, KNR, NZB, MDK పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ మళ్లీ గెలుస్తుందా అని రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి జీవన్‌రెడ్డి గెలిచారు. ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి ‘అల్ఫోర్స్’ అధినేత నరేందర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి కైవసం చేసుకోవడానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది.