News January 25, 2025

బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

image

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.

Similar News

News January 27, 2025

చెన్నైలో విశాఖ డాక్టర్ అరెస్ట్

image

విశాఖలో కిడ్నీ ఆసుపత్రి నిర్వహిస్తున్న డా.రాజశేఖర్‌ను చెన్నైలో హైదరాబాద్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వారం రోజులుగా హైదరాబాద్, చెన్నై కేంద్రాలుగా నడుస్తున్న కిడ్నీ రాకెట్‌పై పోలీసులు దృష్టి సారించారు. ఈ రాకెట్‌లో విశాఖకు చెందిన డా.రాజశేఖర్ ఓ ముఠాను ఏర్పాటు చేసి కిడ్నీల మార్పిడికి పాల్పడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిని అరెస్ట్ చేసి హైదరాబాద్‌కు తీసుకొస్తున్నారు.

News January 27, 2025

తగరపువలస ఘటనలో మరో చిన్నారి మృతి

image

తగరపువలసలోని ఆదర్శనగర్‌లో పురుగుమందు తాగిన ఘటనలో <<15257483>>విషాదం <<>>చోటుచేసుకుంది. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఇషిత(5) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల భార్యాభర్తల గొడవతో మనస్తాపం చెందిన వివాహిత మాధవి(25) ఇద్దరి కుమార్తెలతో పాటు పురుగు మందు తాగిన విషయం తెలిసిందే. దీంతో మాధవితో పాటు చిన్న కుమార్తె శనివారం మృతి చెందింది. మృతిరాలి భర్త రామకృష్ణ ప్రైవేట్ పరిశ్రమలో ఉద్యోగా పనిచేస్తున్నాడు.

News January 27, 2025

విశాఖ కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు

image

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సందర్భంగా ఆదివారం సాయంత్రం కలెక్టర్ బంగ్లాలో హై-టీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో ప‌ద్మ శ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కూటికుప్పల సూర్యరావు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, నేవీ అధికారులు, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులు వేడుక‌ల్లో భాగ‌స్వామ్యం అయ్యారు. ఈ కార్య‌క్ర‌మంలో ముందుగా చిన్నారులు నిర్వ‌‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆక‌ట్టుకున్నాయి.