News January 25, 2025
బ్యాంక్ అధికారులతో సమావేశమైన విశాఖ సీపీ

విశాఖ నగరంలో బ్యాంక్ అధికారులతో సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం సమావేశం అయ్యారు. సైబర్ క్రైమ్ బాధితులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే దర్యాప్తు కోసం బ్యాంకులకు పోలీసులు సమాచారం కోరితే నెల రోజులు గడిచినా సమాచారం ఇవ్వడం లేదన్నారు. సైబర్ క్రైమ్, ఏటీఎంలలో దొంగతనం జరిగినప్పుడు పోలీసులకు బ్యాంక్ అధికారులు సహకరించాలన్నారు. బ్యాంకులు, పోలీసులు పరస్పర సహకారంతో బాధితులకు న్యాయం చేయొచన్నారు.
Similar News
News February 15, 2025
విశాఖలో జీబీఎస్ కలకలం.. ఐదు కేసులు నమోదు

విశాఖలో గులియన్ బారే సిండ్రోం (జీబీఎస్) కేసులు నమోదు కావడం కలకలం రేపింది. గడచిన నాలుగు రోజుల వ్యవధిలో ఐదుగురు ఈ సమస్యతో కేజీహెచ్‌లో చేరారు. ప్రస్తుతం జనరల్ మెడిసిన్ విభాగంలోని ఎక్యూట్ మెడికల్ కేర్ యూనిట్లో వీరు చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. అయితే పూర్తిగా కోలుకునేవరకు తమ పర్యవేక్షణలో సేవలు అందిస్తున్నట్లు కేజీహెచ్ వైద్యులు తెలిపారు.
News February 15, 2025
విశాఖ: కామాంధుడి కోరికలకు వివాహిత బలి

గోపాలపట్నంలో శుక్రవారం జరిగిన వివాహిత ఆత్మహత్య ఘటన కలిచివేసింది. తన వికృత చేష్టలతో భార్యను దారుణంగా హింసించిన భర్త.. చివరకు ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడు. పోర్న్ వీడియోలకు బానిసై భార్యతో మానవ మృగంలా ప్రవర్తించాడు. లైంగిక వాంఛకు ప్రేరేపించే మాత్రలు వేసుకోవాలని ఒత్తిడి చేసేవాడు. మానసికంగా ఎంతో వేదనను అనుభవించిన ఆమె చివరకు ఉరి వేసుకుని తన జీవితానికి ముగింపు పలికింది.
News February 15, 2025
గాజువాక: పరామర్శకు తోడుగా వెళ్లి అనంత లోకాలకు

గాజువాకలో శుక్రవారం ఉదయం జరిగిన ప్రమాదంలో లక్ష్మణరావు అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. సీతమ్మధారలోని ఓ అపార్ట్‌మెంట్‌లో లక్ష్మణరావు వాచ్‌మెన్‌గా పనిచేస్తుండగా ధోబీగా రమణ పనిచేస్తున్నారు. రమణ బంధువులలో ఒకరు చనిపోతే పరామర్శ కోసం ఇద్దరూ స్కూటీపై అనకాపల్లి వెళ్లారు. తిరిగి వస్తుండగా పాత గాజువాక వద్ద లారీ వెనుక నుంచి ఢీకొట్టడంతో లక్ష్మణరావు మృతిచెందినట్లు CI కోటేశ్వరరావు తెలిపారు.