News July 25, 2024

బ్యాంక్ లింకేజీ రుణాల లక్ష్యం రూ.1,990 కోట్లు

image

జిల్లాలోని పొదుపు సంఘాలకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,990 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందించడమే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ PD సాంబశివారెడ్డి తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో జిల్లాలో పొదుపు సంఘాలకు రూ.1,600 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేశామన్నారు. జూలై చివరినాటికి రూ.700 కోట్లు బ్యాంక్ లింకేజీ రుణాలు చేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు

Similar News

News January 18, 2025

నెల్లూరు: ‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టర్, ఎస్పీ మణికంఠ, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 

News January 18, 2025

నెల్లూరు: వైభవంగా రాపత్తు ఉత్సవాలు 

image

నెల్లూరు నగరం రంగనాయకులపేటలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో రాపత్తు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజైన శుక్రవారం దేవేరుల సమేత రంగనాథుడికి వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు రంగనాథస్వామిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.

News January 17, 2025

‘రిపబ్లిక్ డే వేడుకలు సమర్ధవంతంగా నిర్వహించాలి’

image

76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఘనంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ ఎస్పీ మణికంఠ చందోలు, జేసీ శుభం బన్సల్ పాల్గొని మాట్లాడారు. ఈసారి జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.