News March 17, 2026
‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ పేరు మార్పు.. స్పందించిన డైరెక్టర్

సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ మూవీ <<19398040>>పేరును<<>> ‘మాతృభూమి’గా మార్చడం తెలిసిందే. దీనిపై మూవీ డైరెక్టర్ అపూర్వ లాఖియా స్పందించారు. ‘ఇది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదు. ముందుగానే 2 టైటిల్స్ నమోదు చేసుకున్నాం. మానవత్వం, సానుభూతి, మన సైనికుల నిశ్శబ్ద పోరాటాల గురించి మూవీ తెలియజేస్తుంది. కొత్త టైటిల్ చిత్రంలోని భావోద్వేగాన్ని మరింత ప్రతిబింబిస్తుంది’ అని తెలిపారు.
Similar News
News April 13, 2026
భారత్ చేరుకున్న ఇరాన్ నౌకలు

పశ్చిమాసియా యుద్ధం వేళ ఇరాన్ చమురు నౌకలు రెండు భారత్ చేరుకున్నాయి. గుజరాత్‌లోని సిక్కా పోర్టులో ఇవి లంగరేసినట్లు షిప్ ట్రాకింగ్ డేటా చెబుతోంది. దీంతో ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ చమురు వచ్చినట్లయింది. సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల క్రూడాయిల్‌తో మార్చి రెండో వారంలో ఈ రెండు నౌకలు ఖర్గ్ ద్వీపం నుంచి బయల్దేరాయి.
News April 13, 2026
కొవిడ్ వ్యాక్సిన్.. చావు అంచుకు వెళ్లొచ్చానన్న మస్క్

జర్మనీలో సంభవించిన పది వేలకు పైగా మరణాలకు mRNA వ్యాక్సిన్ కారణమై ఉండొచ్చని ఫైజర్ మాజీ టాక్సికాలజిస్ట్ డాక్టర్ హెల్ముట్ వెల్లడించారు. ఈ వాదనను టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ సమర్థించారు. ‘టీకా డోసేజ్ కచ్చితంగా ఎక్కువగా ఉంది. దాన్ని చాలా సార్లు ప్రజలకు వేశారు. వ్యాక్సిన్ రాకముందు నాకు వైరస్ సోకింది. కానీ భయంకరంగా లేదు. అయితే రెండో టీకా తీసుకున్నప్పుడు నేను చనిపోతున్నట్లుగా అనిపించింది’ అని పేర్కొన్నారు.
News April 13, 2026
మరోసారి తండ్రితో చైతూ స్క్రీన్ షేర్?

‘వృషకర్మ’ చిత్రంతో బిజీగా ఉన్న నాగ చైతన్య మరో 2 చిత్రాలను లైన్‌లో పెట్టినట్లు సమాచారం. కళ్యాణ్ కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న చిత్రంలో తండ్రి నాగార్జునతో కలిసి మరోసారి నటించనున్నట్లు తెలుస్తోంది. అలాగే ‘బెదురులంక 2012’ ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో హీరోగా తన 25వ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇది లవ్&మ్యూజికల్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని, ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని టాలీవుడ్ టాక్.


