News February 20, 2025
బ్యాలెట్ బాక్స్‌లను సక్రమంగా భధ్రపరచాలి: కలెక్టర్

ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసిన తరువాత బ్యాలెట్ బాక్స్‌లను స్ట్రాంగ్ రూంలో సక్రమంగా భద్రపరచాలని గుంటూరు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎన్నికలకు విధులు కేటాయించిన అధికారులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యంగా బ్యాలెట్ బాక్స్‌లు తీసుకునేటప్పుడు సీల్ పూర్తి స్థాయిలో వేసారా లేదా తనిఖీ చేసి బాధ్యతగా విధులు నిర్వహించాలన్నారు.
Similar News
News March 22, 2025
GNT: సీఎంవోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

సీఎంవోలో ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి శనివారం రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సీఎంవోలో పనిచేయడానికి ఫోటోగ్రాఫర్లు-3, వీడియోగ్రాఫర్లు-2 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. వీరికి నెలకు రూ.70,000 వేతనం చెల్లిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
News March 22, 2025
గుంటూరు జిల్లాలో ఈగల్ తనిఖీలు

గుంటూరు జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులపై ఈగల్ సిబ్బంది దాడులను శుక్రవారం నిర్వహించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయిస్తున్న షాపులు.. గుంటూరులో రెండు, తెనాలిలో షాపులను ఈగల్ సిబ్బంది సీజ్ చేశారు. ఈగల్ అధికారులు మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులు, ఏజెన్సీల్లో తనిఖీలు కొనసాగుతాయని, డ్రగ్స్ దుర్వినియోగంపై దాడులు నిర్వహిస్తామన్నారు. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
News March 22, 2025
గుంటూరులో రిమాండ్ ఖైదీ పరార్..!

మూత్రవిసర్జన ముసుగులో రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చోరీకేసులో నిందితుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఖైదీని గుంటూరు జిల్లా జైలు నుంచి తీసుకెళ్ళి తెనాలి కోర్టులో హాజరుపర్చారు. తిరుగు ప్రయాణంలో గుంటూరు బస్టాండ్‌లో మూత్రవిసర్జన కోసం వెళ్లి ఖైదీ తిరిగి రాలేదు. దీంతో ఎస్కార్ట్ పోలీసులు కొత్తపేట స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.