News April 6, 2024
బ్రహ్మపుర్- ఎర్నాకుళం రైలుకు కొత్తవలసలో హాల్ట్
ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎర్నాకుళం- బ్రహ్మపుర్- ఎర్నాకుళం (ట్రైన్ నంబర్స్ 06087/06088) రైలుకు కొత్తవలసలో హాల్ట్ ఇచ్చారు. ఈ రైలు ఎర్నాకుళంలో ప్రతి శనివారం రాత్రి 11 గంటలకు బయలుదేరుతుంది. ఈ రైలు దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస మీదుగా బ్రహ్మపుర్ చేరుతుంది. తిరిగి బ్రహ్మపుర్‌లో సోమవారం మధ్యాహ్నం 12.40 గంటలకు బయలుదేరి కొత్తవలస, దువ్వాడ, గూడూరు, నెల్లూరు మీదుగా ఎర్నాకుళం చేరుతుంది.
Similar News
News January 17, 2025
VZM: జిల్లాలో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు
విజయనగరం జిల్లాలో గడిచిన మూడు రోజుల్లో రూ.22 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో మందుబాబులు వైన్ షాపుల ముందు భారీగా క్యూ కట్టారు. జిల్లాలో 177 మద్యం షాపులు, 28 బార్లు ఉండగా 42,000 మద్యం కేసుల విక్రయాలు జరిగాయి. గతేడాది రూ.20 కోట్లు అమ్మకాలు జరగ్గా.. ఈ ఏడాది రూ.2 కోట్లు అదనంగా ఎక్సైజ్ శాఖకు ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
News January 17, 2025
పార్వతీపురం: స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివాస్-
ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఏ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నెలలో ఒక శనివారం “స్వచ్ఛత” కోసం అంకితం కావాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు పిలుపు ఆకాంక్షించారన్నారు. అందులో భాగంగా ప్రతి నెలలో మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు.
News January 17, 2025
గడ్డం ఉమ ట్వీట్‌కు లోకేశ్ రిప్లై
వైఎస్ జగన్ అభిమాని గడ్డం ఉమ ట్విటర్ వేదికగా కోరిన సాయానికి మంత్రి నారా లోకేశ్ స్పందించారు. విజయనగరం చిన్నారి శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారని, ట్రీట్‌మెంట్‌కు రూ.10 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. పేద కుటుంబం కావడంతో చిన్నారి వైద్యానికి సాయం అందించాలంటూ ఆమె ‘X’లో లోకేశ్‌ను కోరారు. దీనికి స్పందించిన లోకేశ్ చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.