News February 9, 2025
బ్రహ్మసముద్రం: పురుగు మందు తాగి వృద్ధురాలు ఆత్మహత్య

బ్రహ్మసముద్రంలో విషాదం చోటుచేసుకుంది. మండలంలోని బొమ్మగానిపల్లి తండా గ్రామంలో లక్ష్మీబాయి అనే వృద్ధురాలు శనివారం రాత్రి పురుగు మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Similar News
News March 12, 2025
రేపు కలెక్టర్ అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమం

అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అనంత మిత్ర లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా చేపట్టారు. రేపు అనంత రేడియో స్టేషన్ నుంచి ఉదయం 7.45 నుంచి 8.15 గంటల వరకు సర్వీస్ ఆఫ్ ట్రాన్స్ పోర్ట్ డిపార్ట్మెంట్ అనే అంశంపై ప్రజలతో సమస్యలు తెలుసుకోనున్నారు. 08554-225533 నంబర్‌కు ఫోన్ చేసి మాట్లాడవచ్చన్నారు.
News March 12, 2025
రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్

ప్రాథమిక రంగం వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన అధికారులతో కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గురువారం మధ్యాహ్నం అనంతపురంలోని ఆదిమూర్తి నగర్లో ఉన్న జిల్లా హార్టికల్చర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో కార్యక్రమం జరిగింది. వివిధ రకాల పంటలు పండిస్తున్న రైతులకు సూచనలు, సలహాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు చేపడతామని హెచ్చరించారు.
News March 12, 2025
తాత్కాలికంగా ఆ రైలు అనంతపురం వరకే!

నంద్యాల మీదుగా ప్రయాణించే మచిలీపట్నం-ధర్మవరం(17215), ధర్మవరం-మచిలీపట్నం (17216) రైలు తాత్కాలికంగా అనంతపురం-ధర్మవరం మధ్య రద్దు చేశారు. ధర్మవరంలోని ప్లాట్ ఫాం నంబర్ 5పై జరుగుతున్న మరమ్మతుల కారణంగా ఈ నెల 12 నుంచి 30వ తేదీ వరకు ఈ రైలు మచిలీపట్నం నుంచి అనంతపురం వరకు మాత్రమే ప్రయాణిస్తుందన్నారు. అలాగే ఈనెల 13 నుంచి 31వ తేదీ వరకు ఈ రైలు అనంతపురం నుంచే బయలుదేరి మచిలీపట్నం వెళ్తుంది.