News January 31, 2025
బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతున్న చెర్వుగట్టు

చెర్వుగట్టు శ్రీ పార్వతి జిల్లా రామలింగేశ్వర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతోంది. ఫిబ్రవరి 2 నుంచి చెర్వుగట్టులో వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయానికి రంగులు వేసే కార్యక్రమం పూర్తి కావచ్చిందని టెంపుల్ కార్యనిర్వాహణాధికారి నవీన్ కుమార్ అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 13, 2025
విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెం వద్ద ఆటోలో ప్రమాదకర స్థితిలో వెళ్తున్న మోడల్ స్కూల్ విద్యార్థులను చూసి చలించిన ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆటోను ఆపి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సమయానికి ప్రత్యేక బస్సును ఏర్పాటు చేయాలని మిర్యాలగూడ ఆర్టీసీ డిపో అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. ఎమ్మెల్యే స్పందన పట్ల స్థానిక ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
News November 13, 2025
ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి దాడి చేశారు: FRO

చందంపేట మండలం గువ్వలగుట్ట తండాలో నిన్న జరిగిన దాడిపై ఫారెస్ట్ రేంజ్ అధికారి భాస్కర్ గురువారం కీలక విషయాలు వెల్లడించారు. అటవీ భూమిలో సాగు చేస్తున్న గిరిజనులను హక్కు పత్రాలు చూపాలని కోరామన్నారు. కొన్నేళ్లుగా తాము సాగు చేసుకుంటున్నామని వాగ్వాదానికి దిగి ఐదుగురు వ్యక్తులు గ్రామస్థులతో కలిసి రాళ్ళు, కర్రలతో దాడి చేసి గాయపరిచారని చెప్పారు.
News November 13, 2025
NLG: నిర్దిష్ట లక్ష్యంతోనే పనులు: DRDO

జిల్లాలో చేపట్టిన జల్ సంచయ్, జల్ భాగీదారి కార్యక్రమం చేపట్టిన పనులకు కేంద్ర జలశక్తి శాఖ పురస్కారం ప్రకటించడం సంతోషంగా ఉందని DRDO పీడీ శేఖర్ రెడ్డి తెలిపారు. కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచనలతో తాము ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేశామన్నారు. నీటి వనరుల కొరత ఉన్న ప్రాంతాల్లో వర్షపు నీటిని సంరక్షించడంతో పాటుగా, భూగర్భజలాలు పెంచడమే కేంద్రంగా ఈ పనులు గుర్తించి నిర్వహించామన్నారు.


