News February 25, 2026
బ్రాహ్మణపల్లిలో షీ టీం అవగాహన సదస్సు

రామగుండం సీపీ ఆదేశాల మేరకు, షీ టీం ఇంచార్జి ఎస్ఐ లావణ్య ఆధ్వర్యంలో పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో వార్డ్ మెంబర్ల శిక్షణలో భాగంగా అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళల భద్రత, సైబర్ మోసాలు, యాంటీ డ్రగ్స్ అంశాలపై వివరించారు. వేధింపులపై 6303923700కు, సైబర్ మోసాలపై 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో 100కు డయల్ చేయాలన్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News April 16, 2026
ఏపీలో 38, తెలంగాణలో 26 సీట్లకు పెంపు: షా

డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అమిత్ షా LSలో విమర్శించారు. ‘అందులో ఏ మాత్రం నిజం లేదు. దక్షిణాదిలో జనాభా రేషియో కంటే ఎక్కువ సీట్లు పెరుగుతున్నాయి. ఏపీలో సీట్లు 25 నుంచి 38, తెలంగాణలో 17 నుంచి 26కు పెరుగుతాయి. కర్ణాటక, తమిళనాడులోనూ అంతే. ఇది నా గ్యారంటీ. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి’ అని స్పష్టం చేశారు.
News April 16, 2026
రూ. 74.2 కోట్లతో కాలువలు, రోడ్ల అభివృద్ధి: కలెక్టర్

ఆత్రేయపురం మండలం లొల్లలాకులు కాలువల మరమ్మతులు, ఆధునీకరణ, రావులపాలెం-బొబ్బర్లంక రహదారి విస్తరణ పనుల కోసం ప్రభుత్వం ₹74.2 కోట్లు కేటాయించింది. ఈ పనులకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు లభించాయి. ప్రస్తుతం డిజైన్ ప్రతిపాదనలు చీఫ్ ఇంజినీర్ పరిశీలనలో ఉన్నాయని, అనుమతులు రాగానే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ తెలిపారు.
News April 16, 2026
TG DEECET దరఖాస్తుల సవరణకు అవకాశం

TG DEECET-2026 ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు విద్యాశాఖ కీలక సమాచారం అందించింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకు జరిగిన దరఖాస్తు ప్రక్రియలో భాగంగా మొత్తం 32,611 దరఖాస్తులు అందినట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే ఈనెల 17, 18వ తేదీల్లో వెబ్‌సైట్ ద్వారా సవరించుకోవచ్చు. సందేహాల నివృత్తికి 8317567404 నంబర్‌ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.


