News May 11, 2024
బ్రాహ్మణపల్లి ప్రత్యేకత ఇదే.. .

మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆత్మకూరు, ఉదయగిరి వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు కూడా బ్రాహ్మణపల్లిలోనే ఓటు వేయనున్నారు.
Similar News
News January 3, 2026
నెల్లూరు: చిన్నారి మృతదేహాన్ని లాక్కొచ్చిన కుక్కలు

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేటలో చిన్నారి <<18745357>>మృతదేహం <<>>శుక్రవారం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఎస్ఐ నాగార్జున రెడ్డి విచారణ చేపట్టి అసలు విషయాలు వెల్లడించారు. రావురు డొంక గిరిజన కాలనీకి చెందిన వెలుగు జానయ్య 5నెలల కుమారుడు గత నెల 26న అనారోగ్యంతో చనిపోయాడు. మృతదేహాన్ని జగనన్న కాలనీ సమీపంలో తక్కువ లోతు గుంత తీసి పూడ్చారు. కుక్కలు మట్టి తవ్వి మృతదేహాన్ని బయటకు లాక్కొచ్చాయని ఎస్ఐ విచారణలో తేలింది.
News January 3, 2026
నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News January 3, 2026
వ్యవసాయ యాంత్రీకరణకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి : కలెక్టర్

వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల బ్యాంకర్లను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమితి సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈనెల 28వ తేదీన వ్యవసాయ యాంత్రీకరణతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేస్తున్న రుణాలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు.


