News May 11, 2024
బ్రాహ్మణపల్లి ప్రత్యేకత ఇదే.. .

మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి పోలింగ్ కేంద్రానికి ప్రత్యేకత ఉంది. ఈ పోలింగ్ కేంద్రంలో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుతం ఆత్మకూరు, ఉదయగిరి వైసీపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు కూడా బ్రాహ్మణపల్లిలోనే ఓటు వేయనున్నారు.
Similar News
News February 18, 2025
నెల్లూరు కలెక్టర్‌ను ప్రశ్నిస్తూ కాకాణి లేఖ

నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ వ్యవహారంలో జిల్లా కలెక్టర్ ఆనంద్ వ్యవహరించిన తీరుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయ ధోరణితో రాజకీయాలతో సత్సంబంధాలు ఉన్నాయంటూ.. నిబంధనలకు విరుద్ధంగా 5 మంది సభ్యుల సభ్యత్వాన్ని కలెక్టర్ రద్దు చేయడంపై లేఖాస్త్రం సంధించారు. ఇప్పుడున్న కమిటీని రద్దుచేసి నిబంధన ప్రకారం కమిటీని ఎన్నుకోవాలన్నారు. లేదంటే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు.
News February 18, 2025
నెల్లూరు జిల్లాలో రిపోర్టర్లు కావలెను

నెల్లూరు జిల్లా పరిధిలో పనిచేయడానికి Way2News రిపోర్టర్లను ఆహ్వానిస్తోంది. అనుభవం ఉన్న వాళ్లు మాత్రమే అర్హులు. ప్రస్తుతం ఇతర సంస్థల్లో పనిచేస్తున్న వాళ్లు సైతం మాకు వార్తలు రాయడానికి అర్హులు అవుతారు. ఆసక్తి ఉన్నవారు ఈ <
News February 18, 2025
నెల్లూరు: సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతు

సముద్రపు వేటకు వెళ్లి మత్స్యకారుడు గల్లంతైన ఘటన TP గూడూరు(M)లో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వెంకన్నపాలెం పట్టపుపాలెం గ్రామానికి చెందిన కే.వెంకటేశ్వర్లు అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి తీరానికి చేరుకోలేదు. తోటి మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇందుకూరుపేట(M), కొరుటూరు సమీపంలో మృతదేహం కొట్టుకొచ్చింది. తోటపల్లి గూడూరు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.