News September 20, 2024
బ్రోకర్లు వైసీపీని వీడటం మంచిదే: మిథున్ రెడ్డి
వైసీపీలో ప్రస్తుతం రాజీనామాల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి కుమారుడు, రాజంపేట ఎంపీ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘బ్రోకర్లు, స్క్రాప్ లాంటి నాయకులు పార్టీని విడిచిపెట్టి వెళ్లిపోవడం మనకి చాలా మంచిది. ఇప్పుడు ఉండే నాయకులు, కార్యకర్తలు గట్టిగా పనిచేస్తే మనకు కచ్చితంగా పూర్వవైభవం వస్తుంది. ఆ దిశగా అందరం పనిచేద్దాం’ అని మిథున్ రెడ్డి పిలుపునిచ్చారు.
Similar News
News October 3, 2024
పెండ్లిమర్రి: పిడుగు పడి ముగ్గురు మృతి
పెండ్లిమర్రి మండలంలో గురువారం పిడుగుపాటుకు ముగ్గురు మృతి చెందారు. మండలంలోని తుమ్మలూరు పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేందుకు వెళ్లి సాయంత్రం 5 గంటల ప్రాంతంలో పిడుగుపాటు గురై ఓ మహిళ, ఓ అబ్బాయి మరణించారు. అలాగే పగడాలపల్లికి చెందిన మరో యువకుడు ఇసుక తోలుకోవడానికి వెళ్లి మరణించారు. సమాచారం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
News October 3, 2024
కడప: భారీగా మొబైల్ ఫోన్ల రికవరీ
కడప జిల్లా వ్యాప్తంగా ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్స్ పోగొట్టుకున్న బాధితులకు జిల్లా పోలీసులు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ హర్షవర్ధన్ రాజు చేతుల మీదుగా బాధితులకు మొబైల్స్‌ను అందజేశారు. దాదాపు రూ.1.8 కోట్ల విలువగల 555 మొబైల్స్‌ను రికవరీ చేసి బాధితులకు అందించారు. ఆపరేషన్ మొబైల్ షీల్డ్ ప్రత్యేక డ్రైవ్ లో సైబర్ క్రైమ్ పోలీసుల సాంకేతిక పరిజ్ఞానంతో పోగొట్టుకున్న మొబైల్స్‌ను కనుగొన్నారు.
News October 3, 2024
కడపలో టెన్త్ అర్హతతో ఉద్యోగాలు
కడపలోని కాగితాలపెంట ప్రభుత్వ ఐటీఐలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ఏడీ కె.రత్నబాబు తెలిపారు. ఈనెల 4న ఉదయం 10 గంటలతు టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసైన అభ్యర్థులు హాజరుకావాలన్నారు. ICICI బ్యాంకు, అభి గ్రీన్ టెక్నాలజీ, రిలయన్స్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో రావాలన్నారు.