News February 4, 2025

భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడాలి: విశాఖ డీఐజీ

image

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలని విశాఖపట్నం డీఐజీ గోపీనాథ్ జట్టి సూచించారు. మంగళవారం రథసప్తమి సందర్భంగా ఆయన స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ మహేశ్వర రెడ్డితో బందోబస్తు విధులు నిర్వహణ, ఏర్పాట్లపై అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 11, 2025

శ్రీకాకుళం: టెన్త్ అర్హతతో 34 ఉద్యోగాలు

image

శ్రీకాకుళం డివిజన్ పరిధిలో 34 GDS పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్‌లో మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. >Share it

News February 11, 2025

అరసవల్లి ఆదిత్యుని హుండీ లెక్కింపు

image

అరసవల్లి సూర్యనారాయణ స్వామివారి హుండీల ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు అధికారులు తెలిపారు. నగదు రూపంలో రూ.64,39,016 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ పేర్కొన్నారు. అలాగే 17.4గ్రాముల బంగారం, 1.212కేజీ వెండి వచ్చిందని వెల్లడించారు.

News February 11, 2025

శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో పరీక్షలు

image

ఇంటర్మీడియట్ బోర్డు పబ్లిక్ పరీక్షలు శ్రీకాకుళం జిల్లాలో 75 కేంద్రాల్లో జరుగుతాయని జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి ప్రగడ దుర్గారావు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షలకు 40,346 మంది హాజరు అవుతారని, పరీక్షలు జంబ్లింగ్ పద్ధతిలో జరుగుతాయన్నారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా పరీక్షలు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ప్రాక్టికల్ పరీక్షలు ఈనెల పదవ తేదీ నుంచి ప్రారంభం అయ్యాయని అన్నారు.

error: Content is protected !!