News April 5, 2024
భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తాం: ఈవో

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కల్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎల్ రమాదేవి తెలిపారు. భక్తులు సీతారాముల కళ్యాణం వీక్షించడానికి 16 సెక్టార్లు ఏర్పాటు చేస్తామని, రెండున్నర లక్షల లడ్డూలు తయారు చేస్తున్నామన్నారు. అలాగే ఐదు లక్షల ముత్యాల తలంబ్రాలు ప్యాకెట్ లు సిద్ధం చేస్తున్నట్లు ఈవో తెలిపారు.
Similar News
News October 31, 2025
నేటి నుంచి విజయ డెయిరీ దుకాణాలకు టెండర్లు

ఖమ్మం నగరంలోని విజయ డెయిరీ ఆవరణలో నిర్మించిన 10 దుకాణ సమూదాయాలను అద్దెకు ఇచ్చేందుకు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు టెండర్లు నిర్వహిస్తున్నట్లు డెయిరీ డిప్యూటీ డైరెక్టర్ కోడిరెక్క రవికుమార్ తెలిపారు. ఒక్కో దుకాణానికి నెలకు రూ.15వేలుగా నిర్ణయించామని, సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.2 లక్షలు చెల్లించాలన్నారు.
News October 31, 2025
మాజీ సర్పంచ్ రామారావు హత్యపై సీపీ ఆరా

చింతకాని పాతర్లపాడు మాజీ సర్పంచ్, సీపీఎం నేత సామినేని రామారావు హత్య ఘటనపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీపీఎం నేతలు గోపాలరావు, సుదర్శన్ నుంచి ఆయన వివరాలు సేకరించారు. ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సీపీ దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించారు.
News October 31, 2025
ఖమ్మం: టీచర్‌గా మారిన కలెక్టర్ అనుదీప్

ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి గురువారం ఎన్‌ఎస్‌సీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమం అమలును తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన టీచర్‌గా మారి బోర్డుపై అక్షరాలు రాసి, విద్యార్థుల చదివే సామర్థ్యాన్ని పరిశీలించారు. ప్రతి విద్యార్థి చదివి అర్థం చేసుకునే స్థాయికి చేరేలా ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆయన సూచించారు. 30 రోజుల్లో ఫలితాలు కనిపించాలని ఆయన ఆకాంక్షించారు.


