News January 24, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: నిర్మల్ కలెక్టర్

image

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరా తీశారు. గురువారం వేడుకలు ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి వెళ్లిన ఆలయ అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

Similar News

News December 4, 2025

సిరిసిల్ల: మాజీ సీఎం కే.రోశయ్యకు ఘన నివాళులు

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య వర్ధంతి వేడుకలను సిరిసిల్లలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్ గరీమా అగర్వాల్, ఇతర అధికారులతో కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు.

News December 4, 2025

భద్రాద్రి: ‘రాజీ పడితే సమయం, డబ్బు ఆదా’

image

ఈ నెల 21న జిల్లా కోర్టులో జరగనున్న జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎం. రాజేందర్ గురువారం తెలిపారు. లోక్ అదాలత్‌లో తమ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతాయని పేర్కొన్నారు. రాజీకి సిద్ధంగా ఉన్న కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

News December 4, 2025

తూ.గో: రోడ్డు ప్రమాదం.. దంపతుల మృతి

image

రాజానగరం జాతీయ రహదారిపై గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నందరాడకు చెందిన దంపతులు లీలా ప్రసాద్ (23), సోనియా (20) మృతి చెందారు. బ్యాంకు పని నిమిత్తం స్కూటీపై రాజానగరం వచ్చి, వైఎస్ఆర్ జంక్షన్ వద్ద రోడ్డు దాటుతుండగా.. రాజమహేంద్రవరం వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ అదుపుతప్పి వారిని ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో వారి మూడు నెలల పసిపాప అనాథగా మిగిలింది.