News January 24, 2025

భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడండి: నిర్మల్ కలెక్టర్

image

బాసర సరస్వతి అమ్మవారి సన్నిధిలో ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 3 రోజులపాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్లపై నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆరా తీశారు. గురువారం వేడుకలు ఆహ్వాన పత్రాన్ని అందజేయడానికి వెళ్లిన ఆలయ అధికారులు సిబ్బందికి పలు సూచనలు ఇచ్చారు. వేడుకలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చెప్పారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించారు.

Similar News

News July 8, 2025

చలాన్లు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్?

image

TG: ట్రాఫిక్ చలాన్లు చెల్లించనివారిపై చర్యలకు రవాణాశాఖ సిద్ధమైంది. మూడు నెలల పాటు పెండింగ్‌లో ఉంటే లైసెన్స్ సస్పెండ్ చేయాలన్న పోలీసుల ప్రతిపాదనలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయంతో ట్రాఫిక్ రూల్స్ అతిక్రమణకు కళ్లెం వేయడంతో పాటు భారీగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత 7 నెలల్లో పదేపదే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన 18,973 మంది లైసెన్స్‌లను అధికారులు సస్పెండ్ చేశారు.

News July 8, 2025

కామారెడ్డి మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్

image

కామారెడ్డిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు నూతన ప్రిన్సిపల్‌గా వాల్యను నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. గాంధీ మెడికల్ కళాశాలలో ఆర్థోపెడిక్స్ విభాగంలో హెడ్ అఫ్ ది డిపార్ట్మెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ డా.వాల్య ప్రమోషన్ పై జిల్లా మెడికల్ కళాశాలకు పిన్సిపల్‌గా రానున్నట్లు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల్లో పేర్కొంది.

News July 8, 2025

మహబూబాబాద్ నుంచి తిరుపతికి స్పెషల్ ట్రైన్

image

కాచిగూడ నుంచి మహబూబాబాద్, డోర్నకల్ మీదుగా తిరుపతి వెళ్లడానికి స్పెషల్ ట్రైన్ నడుపుతున్నామని దక్షిణమధ్య రైల్వే ఎస్టీఎం రాజనర్సు తెలిపారు. కాచిగూడ-తిరుపతి, తిరుపతి-కాచిగూడ స్పెషల్ ట్రైన్ జులై 10, 17, 24, 31 తేదీల్లో నడుపుతున్నామని ప్రయాణికులు గమనించాలని సూచించారు.