News February 15, 2025
భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కలెక్టరేట్లో శుక్రవారం సంబంధిత శాఖల జిల్లా అధికారులతో వరంగల్ కలెక్టర్ సత్యశారదా దేవి సమావేశం నిర్వహించారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాట్లు చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, అర్చకులు పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
WGL: బెట్టింగ్ భూతం.. తీస్తుంది ప్రాణం!

ఐపీఎల్ మొదలు కావడంతో ఇప్పుడు అందరి నోటా బెట్టింగ్ మాటే. ఆటను అస్వాదించే వాళ్లు కొందరైతే, వ్యసనమై బెట్టింగ్‌లో రూ.లక్షల్లో నష్టపోయి SUICIDE చేసుకునే వాళ్లు కోకొల్లలు. ఈ నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పోలీసులు బెట్టింగ్‌లపై నిఘా పెట్టారు. ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు గమనించాల్సిన బాధ్యత ఉందన్నారు.
News March 22, 2025
ప్రారంభమైన కాజీపేట-విజయవాడ (MEMU) ట్రైన్

కాజీపేట నుంచి డోర్నకల్, ఖమ్మం మీదుగా విజయవాడ వరకు వెళ్లే (MEMU) ట్రైన్ నంబర్ 67269) ఈరోజు నుంచి ప్రారంభమైంది. ట్రైన్ ఉ.6:40 ని.లకు బయలుదేరి మధ్యాహ్నం 12: 00 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మూడో లైన్ పనులు, కారణాల వల్ల కొంతకాలంగా ఈ ట్రైన్ నిలిపివేశారు. పనులు పూర్తి కావడంతో ఈ రైలును మళ్లీ పునరుద్ధరించారు.
News March 22, 2025
బెట్టింగ్ రాయుళ్లపై నజర్ పెట్టండి: వరంగల్ సీపీ

నేటి నుంచి ఐపీఎల్ క్రికెట్ ప్రారంభమవుతున్న వేళ క్రికెట్ బెట్టింగ్‌లకు అవకాశం ఉండటంతో WGL CP సన్ ప్రీత్ సింగ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. కమిషనరేట్ పరిధిలో బెట్టింగ్ రాయుళ్లపై నిఘా పెట్టాలని, యువత బెట్టింగ్‌పై ఆసక్తి చూపకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గతంలో బెట్టింగ్‌లకు పాల్పడిన వారిపై నిఘా పెట్టాలని, ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే తక్షణమే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.