News October 27, 2024
భక్తులతో కళకళలాడుతున్న మహానంది ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం మహానంది ఆదివారం రోజు కావడంతో భక్తులతో సందడి నెలకొంది. ఉదయం నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని ముందుగా కోనేరుల్లో పుణ్యస్నానాలు ఆచరించి శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వేకువజామున స్వామి, అమ్మవారికి స్థానిక అభిషేకం, కుంకుమార్చన, మహా మంగళ హారతులు చేపట్టారు.
Similar News
News November 16, 2025
సివిల్స్కు ఉచిత కోచింగ.. దరఖాస్తుల ఆహ్వానం

డా. బి.ఆర్. అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ద్వారా యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్-2026, మెయిన్స్కు ఉచిత రెసిడెన్షియల్ కోచింగ్కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కర్నూలు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. డిగ్రీ పూర్తి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు అర్హులని ఆమె వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 340 సీట్లు ఉన్నాయన్నారు. అభ్యర్థులు నవంబర్ 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 16, 2025
కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 16, 2025
కర్నూలు: 675 మందిపై కేసులు

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.


