News February 25, 2025

భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఘటనపై ఆరా

image

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో గుడాలకోన వద్ద జరిగిన ఈ ఘటనపై ఎస్పీ విద్యాసాగర్‌తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News September 16, 2025

నేటి నుంచి జీవీఎంసీ కార్పొరేటర్ల అధ్యయన యాత్ర

image

జీవీఎంసీ కార్పొరేటర్లు మంగళవారం అధ్యయన యాత్రలో పాల్గొననున్నరు. ఈ ప్రయాణంలో భాగంగా రేపు జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను సందర్శించనున్నారు. అనంతరం ఆజ్మీర్, జోద్‌పూర్ నగరాల్లో పర్యటించి పట్టణ అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలిస్తారు. కార్పొరేటర్ల బృందం ఈనెల 24న తిరిగి విశాఖకి చేరుకుంటుంది.

News September 16, 2025

విశాఖ: 19న జాబ్ మేళా

image

కంచరపాలెం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్ (ఎన్‌సీఎస్‌సీ)లో ఈనెల 19న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ ఉపాధి కల్పనాధికారి శ్యాం సుందర్ తెలిపారు. బీపీవో, రిలేషిప్ మేనేజర్, టెలీకాలింగ్ ఆపరేటర్‌ విభాగాల్లో సుమారు 100 ఉద్యోగాలకు డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, ఎంబీఏ పాస్ అయిన నిరుద్యోగులు అర్హులుగా పేర్కొన్నారు. 19న ఉదయం 10 గంటలకు తమ సర్టిఫికెట్స్‌తో హాజరుకావాలని కోరారు.

News September 15, 2025

విశాఖ సీపీ కార్యాలయానికి 115 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో భాగంగా పోలీస్ కమీషనరేట్‌లో సోమవారం 115 ఫిర్యాదులు వచ్చాయని కమిషనర్ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఫిర్యాదుదారులతో నేరుగా ఆయన మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత పోలీసు అధికారులతో ఫోన్‌లో, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి చట్టపరంగా సమస్య పరిష్కారించాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్‌లో ఒకసారి నమోదైన ఫిర్యాదు పునరావృతం కాకుండా చూడాలన్నారు.