News February 25, 2025

భక్తులపై ఏనుగులు దాడి.. హోంమంత్రి అనిత ఆరా

image

భక్తులపై ఏనుగుల దాడి చేసిన ఘటనపై హోంమంత్రి అనిత ద్రిగ్భాంతి వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లాలోని వైకోట సమీపంలో ఏనుగుల దాడి ఘటనపై ఎస్పీ విద్యాసాగర్‌తో హోంమంత్రి మాట్లాడారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని ఏనుగుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని గుండాల కోనకు వెళ్లే భక్తులకు మరింత భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు.

Similar News

News February 26, 2025

విశాఖపట్నంలో టుడే టాప్ న్యూస్

image

➤ విశాఖలో మూతపడిన మద్యం షాప్‌లు ➤ విశాఖ ఆర్డీవో శ్రీలేఖకు హైకోర్టులో చుక్కెదురు ➤ నేటితో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ➤ ఎమ్మెల్సీ ఎన్నికలకు 123 పోలింగ్ కేంద్రాలు.. 22493 మంది ఓటర్లు ➤ రేపు విశాఖ రానున్న సినీ నటుడు బ్రహ్మానందం ➤ విశాఖలో ఆధార్ కార్డు లేని చిన్నారులు 3200 మంది ➤ వెంకోజీపాలెంలో వ్యక్తి దారుణ హత్య

News February 26, 2025

విశాఖ రైల్వే స్టేషన్‌లో DRM ఆకస్మిక తనిఖీ 

image

వాల్తేరు DRM లలిత్ బోహ్రా మంగళవారం మొదటి సారిగా విశాఖ రైల్వే స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లో పరిశుభ్రత, కోచ్ నిర్వహణ సమస్యలు, రద్దీ, భద్రతకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. జనరల్ బుకింగ్ ఆఫీస్, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, క్యాటరింగ్ స్టాల్స్ మొదలైన వాటిని పరిశీలించారు. స్టేషన్‌లో పురోగతిలో ఉన్న పనులను సీనియర్ అధికారులతో సమీక్షించారు.

News February 25, 2025

విశాఖ: ‘నిర్ణీత సమయంలో ధ్రువపత్రాలు అందించాలి’

image

జనన, మరణ, కుల, వివాహ, ఆదాయ ధ్రువపత్రాలను నిర్ణీత సమయంలో అందించాలని జిల్లా న్యాయాధికారి సంస్థ సెక్రటరీ వెంకట శేషమ్మ పేర్కొన్నారు. జీవీఎంసీ జోన్ -4 కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సర్టిఫికెట్లు జారీ విషయంలో ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యంతో 6 నెలలకు ఒకసారి సెన్సిటైజేషన్ కార్యక్రమం నిర్వహించాలని సూచించారు. మ్యారేజ్ ధృవపత్రాలు జారీ చేసేటప్పుడు వధూవరుల వయసు పరిగణలోకి తీసుకోవాలన్నారు.

error: Content is protected !!