News January 29, 2025

భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

ఖమ్మం: సాంస్కృతిక ప్రదర్శనలకు వేదికగా ఉన్న భక్త రామదాసు కళాక్షేత్రాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం భక్త రామదాసు కళా క్షేత్రాన్ని సందర్శించి కళాక్షేత్రంలో చేపట్టిన ఆధునికీకరణ పనులను పరిశీలించారు. కళలకు, కళాకారులకు పుట్టినిల్లు అయిన ఖమ్మం జిల్లాలో ఉన్న భక్త రామదాసు కళా క్షేత్రాన్ని ఆధునీకరించి ఆకర్షణీయంగా తయారు చేయాలని ఆదేశించారు.

Similar News

News October 22, 2025

ఖమ్మం: నిరుద్యోగులకు ఉచిత శిక్షణ

image

ఎస్బీఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నిరుద్యోగ యువకులకు సీసీ టీవీ ఇన్స్టలేషన్ అండ్ సర్వీసింగ్ పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 13 రోజుల శిక్షణలోయూనిఫామ్, వసతి, భోజన సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 27వ తేదీలోగా ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News October 21, 2025

నర్సింగ్ కళాశాల పనులు వేగవంతం చేయాలి: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ నర్సింగ్ కళాశాల పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. కలెక్టర్ అనుదీప్‌తో కలిసి ఆయన పనులను పరిశీలించారు. ₹25 కోట్లతో కళాశాల బ్లాక్ (G+2), హాస్టల్ (G+3) నిర్మాణాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన సానిటరీ, వాల్ పుట్టి పనులు వెంటనే పూర్తి చేయాలని సూచించారు.

News October 21, 2025

జాతీయ రహదారి భూసేకరణ నవంబర్‌లోపు పూర్తి చేయాలి: కలెక్టర్

image

జాతీయ రహదారి 163జీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ సమస్యలను నవంబర్ నెలాఖరులోపు పూర్తి చేసి, ఎన్‌హెచ్‌ఏఐకి భూ బదలాయింపు చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఆర్బిట్రేషన్ ద్వారా రైతులకు మెరుగైన పరిహారం అందుతుందని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న భూములకు పరిహారం చెల్లింపులు, రీ-సర్వే ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన ముగించాలని ఆయన ఆదేశించారు.