News April 24, 2025
భగ్గుమంటున్న పాలమూరు.. జరభద్రం !

ఉమ్మడి పాలమూరు జిల్లాలో రోజురోజుకు ఎండలు భగ్గుమంటున్నాయి. తొలిసారి ఏప్రిల్ నెలలోనే అత్యధికంగా 43 డిగ్రీలపైగా ఉష్ణోగ్రత నమోదైంది. నిన్న వనపర్తి, గద్వాల జిల్లాల్లో 43 డిగ్రీలు, నారాయణంపేటలో 42.4, నాగర్ కర్నూల్ 42.1, మహబూబ్‌నగర్‌లో 42 డిగ్రీలు నమోదైంది. ముందు ముందు ఎండ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. అత్యవసరమైతేనే బయటకు రావాలని, జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది.
Similar News
News April 24, 2025
రాష్ట్రపతితో షా, జైశంకర్ భేటీ

కేంద్ర హోంమంత్రి అమిత్ షా, విదేశాంగ మంత్రి జైశంకర్ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడి, భారత్ చర్యలను రాష్ట్రపతికి వివరించారు. దేశ భద్రత, పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలపై చర్చించారు.
News April 24, 2025
మానవత్వం చాటుకున్న కామారెడ్డి కలెక్టర్

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మానవత్వాన్ని చాటుకున్నారు. భూ భారతిపై అవగాహన సదస్సులో పాల్గొని తిరిగి వస్తుండగా.. నసురుల్లాబాద్-బొమ్మన్ దేవ్ పల్లి చౌరస్తా వద్ద ఓ ద్విచక్ర వాహనదారుడు రోడ్డుపై గాయపడి ఉండటాన్ని ఆయన గమనించారు. వెంటనే తన వాహనాన్ని ఆపి, బాధితుడి వద్దకు వెళ్లారు. ప్రభుత్వ వాహనంలో ఎక్కించి మెరుగైన చికిత్స కోసం బాధితుడిని బాన్సువాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
News April 24, 2025
భారత జవానును బంధించిన పాక్

పహల్గామ్ దాడిపై భారతావని కంటతడి ఆగకముందే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి చూపించింది. ఏప్రిల్ 23న డ్యూటీ చేస్తూ పొరపాటున సరిహద్దు దాటిన BSF జవానును పాకిస్థాన్ రేంజర్లు బంధించారు. ఫిరోజ్‌పూర్ (పంజాబ్) వద్ద సైనికుడు తమ భూభాగంలోకి ప్రవేశించడంతోనే అరెస్టు చేశామని పాక్ సైన్యం చెబుతోంది.