News March 9, 2025
భగ్గుమంటున్న వనపర్తి

వనపర్తి జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరిగింది. నేడు మ.2 గంటల సమయంలో కొత్తకోట మండలంలోని కానాయిపల్లిలో 40.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో కానాయిపల్లి రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలిచింది. అటు వాతావరణ శాఖ ఈ ప్రాంతానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే జిల్లాలోని మిగతా ప్రాంతాల్లోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుంది.
Similar News
News December 2, 2025
HYD: ప్రముఖ హోటళ్లపై కొనసాగుతున్న ఐటీ సోదాలు

హైదరాబాద్లో ప్రముఖ హోటళ్ళపై ఐటీ శాఖ దాడుల పరంపర కొనసాగుతోంది. వుడ్బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీ ఖాన్ను ఐటీ అధికారులు విచారించారు. పిస్తా హౌస్, షాగోస్, మేఫిల్ వంటి హోటళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు భారీగా నగదు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరి ఆర్థిక లావాదేవీలపై, ఇతర హోటళ్లతో ఉన్న సంబంధాలపై ఐటీ శాఖ దృష్టి సారించి పరిశీలన జరుపుతోంది.
News December 2, 2025
భూపాలపల్లి: 3న దివ్యాంగుల దినోత్సవం

జిల్లాలో బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు కలెక్టర్ సమావేశం హాల్లో ఈ వేడుక జరుగుతుందని జిల్లా సంక్షేమ శాఖ అధికారి మల్లిశ్వరి తెలిపారు. జిల్లాలోని అన్ని రకాల దివ్యాంగులు ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఆమె కోరారు.