News March 23, 2025

భగ్గుమంటున్న వనపర్తి

image

వనపర్తి జిల్లాలో 20 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాల్లో గడచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు కింది విధంగా ఉన్నాయి. అత్యధికంగా విలియంకొండ 37.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. పెద్దమందడి 37.7, పెబ్బేరు 37.6, గోపాల్ పేట 37.5, దగడ 37.5, మదనాపూర్ 37.5, కానాయిపల్లి 37.4, ఆత్మకూర్ 37.2, కేతపల్లి 37.2, పానగల్ 37.1, రేమద్దుల 36.9, ఘన్పూర్ 36.7, వెలుగొండ 36.6, వనపర్తి 36.7 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 10, 2025

సురక్షిత ప్రసవమే లక్ష్యం : డిఎంహెచ్ఓ

image

సురక్షిత ప్రసవమే లక్ష్యంగా గర్భిణీలకు వైద్య సేవలందించాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్.భాస్కరరావు స్పష్టం చేశారు. ఈ మేరకు మాతా, శిశు ఆరోగ్యంపై సమీక్షా సమావేశాన్ని పార్వతీపురం ఆరోగ్య కార్యాలయంలో సోమవారం నిర్వహించారు. గర్భిణీలకు నిర్దేశించిన ప్రతీ ఆరోగ్య కార్యక్రమాన్ని పక్కగా అమలు జరిపి మెరుగైన వైద్య సేవలు అందేలా క్షేత్ర స్థాయిలో వైద్య అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు.

News November 10, 2025

నల్గొండ: ధాన్యం కొనుగోలుపై మంత్రుల సమీక్ష

image

ఖరీఫ్ ధాన్యం సేకరణ పురోగతిపై రాష్ట్ర మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. నల్గొండ జిల్లాలో రైతులకు ఇప్పటివరకు రూ.160 కోట్లు చెల్లించినట్లు కలెక్టర్ తెలిపారు. తడిసిన 4,600 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు కొన్నారని వివరించారు. పత్తి కొనుగోళ్ల కోసం అదనంగా తేమ కొలిచే యంత్రాల కొనుగోలుకు మంత్రి తుమ్మల ఆదేశించారు.

News November 10, 2025

స్పోర్ట్స్ రౌండప్

image

➣ ఈ నెల 27న ఢిల్లీలో WPL మెగా వేలం
➣ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ స్టాండింగ్స్: మూడో స్థానంలో IND, తొలి రెండు స్థానాల్లో AUS, SL
➣ బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ ఫరూక్ అహ్మద్‌కు గుండెపోటు.. ఐసీయూలో చికిత్స
➣ రంజీ ట్రోఫీ: తమిళనాడుపై ఆంధ్రప్రదేశ్ విజయం.. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో రషీద్ (87), సెకండ్ ఇన్నింగ్స్‌లో అభిషేక్ రెడ్డి (70), కరణ్ షిండే (51) హాఫ్ సెంచరీలు